Breaking News

నగాల్‌ కావాలనే ఆడలేదు!

Published on Wed, 09/18/2024 - 10:43

న్యూఢిల్లీ: భారత సింగిల్స్‌ స్టార్‌ సుమిత్‌ నగాల్‌ ఉద్దేశపూర్వకంగానే వరుసగా డేవిస్‌ కప్‌ పోటీలకు దూరమవుతున్నాడని అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) ఆరోపించింది. గాయాలు, ఇతరత్రా కారణాలతో ఈ ఏడాది నగాల్‌... పాకిస్తాన్, స్వీడెన్‌లతో జరిగిన డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌–1 టై లకు గైర్హాజరయ్యాడు.

 ఇటీవల స్టాక్‌హోమ్‌లో జరిగిన పోరులో భారత్‌ 0–4తో స్వీడెన్‌తో చిత్తుగా ఓడింది. సుమిత్, యూకీ బంబ్రీలాంటి స్టార్‌ ఆటగాళ్లు బరిలోకి దిగితే కచ్చితంగా ఫలితాలు మరోలా ఉండేవని ‘ఐటా’ కార్యదర్శి అనిల్‌ ధూపర్‌ వివరించారు. స్టాక్‌హోమ్‌కు వెళ్లిన భారత జట్టులో ఒక్క రామ్‌కుమార్‌ రామనాథన్‌ మాత్రమే అనుభవజు్ఞడని, డబుల్స్‌ స్పెషలిస్టు శ్రీరామ్‌ బాలాజీని సింగిల్స్‌లో ఆడించామని చెప్పారు. 

ఆర్యన్‌ షా, సిద్ధార్థ్‌ విశ్వకర్మ అరంగేట్రం చేసిన ఆటగాళ్లని... అందువల్లే భారత్‌ చిత్తుగా ఓడిందని ఆయన అన్నారు. వెన్ను గాయాన్ని కారణంగా చూపించిన నగాల్‌ అదే సమయంలో చైనాలో ఏటీపీ టోర్నీ ఆడుతున్నాడని దుయ్యబట్టారు. డేవిస్‌ కప్‌ అనేది కేవలం ఒక టెన్నిస్‌ టోర్నమెంట్‌ కాదని... దేశానికి ప్రాతినిధ్యం వహించడమని చెప్పుకొచ్చారు. ముకుంద్‌ శశికుమార్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తామని, వచ్చి డేవిడ్‌ కప్‌ ఆడాలని విజ్ఞప్తి చేసినా...అతనూ పట్టించుకోలేదని ధూపర్‌ విమర్శించారు.  

 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)