Breaking News

సుమిత్‌ నగాల్‌కు నిరాశ

Published on Fri, 11/28/2025 - 04:07

చెంగ్డూ (చైనా): టెన్నిస్‌ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌ చేజార్చుకున్నాడు. ఆసియా–పసిఫిక్‌ వైల్డ్‌ కార్డు ప్లే ఆఫ్‌ టోర్నీలో ప్రపంచ 278వ ర్యాంకర్‌ సుమిత్‌ నగాల్‌ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ సుమిత్‌ 2–6, 2–6తో టాప్‌ సీడ్, ప్రపంచ 120వ ర్యాంకర్‌ యుంచావోకెటె బు (చైనా) చేతిలో ఓడిపోయాడు. 

మ్యాచ్‌ మొత్తంలో ఒక్క ఏస్‌ కొట్టి, ఒక్క డబుల్‌ ఫాల్ట్‌ చేసిన సుమిత్‌ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన సుమిత్‌కు 1,500 ఆ్రస్టేలియన్‌ డాలర్లు (రూ. 87 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 28 ఏళ్ల సుమిత్‌ ఇప్పటి వరకు ఎనిమిది సార్లు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మెయిన్‌ ‘డ్రా’లో పోటీపడ్డాడు. కానీ రెండో రౌండ్‌ను దాటి ముందుకెళ్లలేకపోయాడు.  

ఫైనల్లో నిక్కీ పునాచా జోడీ 
ఇదే టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో నిక్కీ పునాచా (భారత్‌)–ప్రుచాయ ఇసారో (థాయ్‌లాండ్‌) జోడీ ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో నిక్కీ–ఇసారో ద్వయం 6–4, 6–2తో జిసుంగ్‌ నామ్‌–యుసుంగ్‌ పార్క్‌ (దక్షిణ కొరియా) జంటపై గెలిచింది. ఫైనల్లో గెలిచిన జోడీకి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ వైల్డ్‌ కార్డు బెర్త్‌ లభిస్తుంది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)