భారత్‌ను గెలిపించిన సంజయ్‌

Published on Thu, 11/27/2025 - 13:02

సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత్‌ మళ్లీ గెలుపు బాట పట్టింది. ఇపో వేదికగా బుధవారం జరిగిన మూడో లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 4–3 గోల్స్‌ తేడాతో ఆతిథ్య మలేసియా జట్టును ఓడించింది. కొరియాపై తొలి మ్యాచ్‌లో 1–0తో నెగ్గిన భారత్‌... బెల్జింయతో జరిగిన రెండో మ్యాచ్‌లో 2–3తో ఓడిపోయింది. 

మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ తరఫున సెల్వం కార్తీ (7వ నిమిషంలో), సుఖ్‌జీత్‌ సింగ్‌ (21వ నిమిషంలో), అమిత్‌ రోహిదాస్‌ (39వ నిమిషంలో), కెప్టెన్‌ సంజయ్‌ (53వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు.

మరో ఏడు నిమిషాల్లో ముగుస్తుందనగా
మలేసియా జట్టుకు ఫైజల్‌ సారి (13వ నిమిషంలో), ఫిత్రి సారి (36వ నిమిషంలో), మర్హాన్‌ జలీల్‌ (45వ నిమిషంలో) ఒక్కో గోల్‌ అందించారు. మ్యాచ్‌ మరో ఏడు నిమిషాల్లో ముగుస్తుందనగా సంజయ్‌ గోల్‌ చేసి భారత్‌ను 4–3తో ఆధిక్యంలో నిలిపాడు. 

ఆ తర్వాత ఈ ఏడు నిమిషాలు భారత రక్షణపంక్తి మలేసియా ఆటగాళ్లను నిలువరించి ఈ టోర్నీలో రెండో విజయాన్ని ఖాయం చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్‌కు నాలుగు పెనాల్టీ కార్నర్‌లు, రెండు పెనాల్టీ స్ట్రోక్‌లు లభించాయి. నాలుగు పెనాల్టీ కార్నర్‌లలో ఒక దానిని... రెండు పెనాల్టీ స్ట్రోక్‌లలో ఒక దానిని భారత్‌ సద్వినియోగం చేసుకుంది. 

ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో భారత్‌ మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. రెండింటిలో గెలిచి, ఒక దాంట్లో ఓడిపోయి ఆరు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక గురువారం జరిగే నాలుగో లీగ్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడుతుంది.

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)