Viral Video: నిప్పులు చెరిగిన ఆసీస్‌ పేసర్‌.. దెబ్బకు రెండుగా చీలిన వికెట్‌

Published on Wed, 07/09/2025 - 11:25

ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్‌లో ఆస్ట్రేలియా యువ ఫాస్ట్‌ బౌలర్‌ రిలే మెరిడిత్‌ చెలరేగిపోయాడు. నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ టోర్నీలో సోమర్‌సెట్‌కు ఆడుతున్న మెరిడిత్‌.. నిన్న (జులై 8) ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరివీర భయంకరంగా బౌలింగ్‌ చేశాడు. 

ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ నాలుగో బంతికి ఎసెక్స్‌ ఓపెనర్‌ కైల్‌ పెప్పర్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేయగా..  వికెట్‌ మధ్యలో రెండు ముక్కలుగా చీలింది. ఇది చూసి మెడిరిత్‌ చాలా ఆనందపడ్డాడు. సహజంగానే ఏ ఫాస్ట్‌ బౌలర్‌కు అయినా ఇది గర్వంచదగ్గ సందర్భం. మెరిడిత్‌ కూడా దీన్ని ఎంజాయ్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

కాగా, ఈ మ్యాచ్‌లో మెరిడిత్‌ జట్టు సోమర్‌సెట్‌ ఎసెక్స్‌పై 95 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సోమర్‌సెట్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. టామ్‌ కోహ్లెర్‌ కాడ్‌మోర్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌తో (39 బంతుల్లో 90; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) బీభత్సం సృష్టించాడు. మిగతా ఆటగాళ్లు నామమాత్రపు ప్రదర్శన చేశారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఎసెక్స్‌.. సోమర్‌సెట్‌ ఫాస్ట్‌ బౌలర్లు మ్యాట్‌ హెన్రీ (4-0-21-4), రిలీ మెరిడిత్‌ (2-0-22-2), క్రెయిగ్‌ ఓవర్టన్‌ (3.1-0-32-2) ధాటికి 14.1 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది. ఎసెక్స్‌ ఇన్నింగ్స్‌లో నోవా థైన్‌ (38) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

 

#

Tags : 1

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)