Breaking News

టీమిండియాకు హార్ట్ బ్రేక్‌.. ఒక్క పరుగు తేడాతో ఓటమి

Published on Sat, 11/02/2024 - 15:24

హాంకాంగ్ సిక్సస్ టోర్నీలో టీమిండియా ఓట‌ముల ప‌రంప‌ర కొన‌సాగుతుంది. తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌పై ఓట‌మి చ‌విచూసిన భార‌త జ‌ట్టు.. తాజాగా యూఏఈతో జ‌రిగిన రెండో మ్యాచ్‌లో ఒక్క ప‌రుగు తేడాతో ప‌రాజ‌యం పాలైంది. ఆఖ‌రి వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియాకు అదృష్టం కలిసిరాలేదు. 

భారత స్టార్ ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ విరోచిత పోరాటం చేసినప్పటకి తమ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఆఖరి ఓవర్‌లో భారత్ విజయానికి 32 పరుగులు అవసరమవ్వగా.. స్టువర్ట్ బిన్నీ వరుసగా 4, వైడ్, 6, 6, 6, 6, 1 బాదాడు. చివ‌రి బంతికి బిన్నీ అనుహ్యంగా ర‌నౌట్ కావ‌డంతో భార‌త్ ఓట‌మి చ‌విచూడాల్సి వ‌చ్చింది. 

దీంతో 131 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 129 ప‌రుగుల వ‌ద్ద  అగిపోయింది. భార‌త బ్యాట‌ర్ల‌లో స్టువ‌ర్ట్ బిన్నీ(11 బంతుల్లో 44, 3 ఫోర్లు, 5 సిక్స్‌లు)తో పాటు కెప్టెన్ రాబిన్ ఉతప్ప (10 బంతుల్లో 43) విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత  6 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.

యూఏఈ ఇన్నింగ్స్‌లో  ఖలీద్ షా(42),  జహూర్ ఖాన్(37)లు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు.  భారత్ బౌలర్లలో స్టువర్ట్ బిన్నీ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. భరత్ చిప్లి, షెహ్‌బాజ్ నదీమ్‌‌కు చెరో వికెట్ దక్కింది. కాగా ఏడేళ్ల తర్వాత మళ్లీ మొదలైన ఈ హాంకాంగ్ క్రికెట్ సిక్సస్ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. ప్ర‌తీ జ‌ట్టులో కేవ‌లం ఆరుగురు ప్లేయర్లే మాత్ర‌మే ఉంటారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)