Breaking News

పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు సర్వం సిద్దం.. ఫేవరెట్‌గా టీమిండియా

Published on Sat, 02/03/2024 - 07:36

ఇస్లామాబాద్‌: డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌–1 ప్లేఆఫ్స్‌లో భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. నేడు, రేపు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగే పోటీల్లో విజయమే లక్ష్యంగా భారత్‌ ఆటకు సిద్ధమైంది. డేవిస్‌ కప్‌ చరిత్రలో పాకిస్తాన్‌పై భారత్‌ది అజేయమైన రికార్డు. దాయాది జట్టుపై ఆడిన ఏడు సార్లు కూడా భారత్‌  విజయం సాధించింది. ఇప్పుడు పాక్‌ గడ్డపై కూడా జైత్రయాత్రను కొనసాగించాలనే లక్ష్యంతో ఉంది.

అయితే సొంతగడ్డపై ఈ డేవిస్‌ టై జరగడం, తురుపు ముక్క ఐజాముల్‌ హక్‌ ఖురేషి బరిలో ఉండటంతో పాక్‌ గంపెడాశలు పెట్టుకుంది. గ్రాస్‌ కోర్టులో ఖురే విశేష అనుభవముంది. ఈ నేపథ్యంలో భారత్‌కు ఏమైన కఠిన సవాల్‌ అంటూ ఉంటే మాత్రం అది ఖురేషి నుంచే ఎదురు కావచ్చు. ఇస్లామాబాద్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో మొదటి రోజు రెండు సింగిల్స్‌ మ్యాచ్‌లను నిర్వహిస్తారు.

తొలి సింగిల్స్‌లో రామ్‌కుమార్‌ రామనాథన్‌... ఐజాముల్‌ హక్‌ ఖురేషితో తలపడతాడు. అనంతరం జరిగే రెండో సింగిల్స్‌లో శ్రీరామ్‌ బాలాజీ... అఖిల్‌ ఖాన్‌ను ఎదుర్కొంటాడు. శ్రీరామ్‌ బాలాజీ చాన్నాళ్లుగా డబుల్స్‌కే పరిమితమయ్యాడు. అయితే భారత సింగిల్స్‌ స్పెషలిస్టు అయిన సుమిత్‌ నగాల్‌... గ్రాస్‌కోర్టు కావడంతో పాక్‌ వెళ్లేందుకు విముఖత చూపాడు. దీంతో శ్రీరామ్‌ను సింగిల్స్‌ బరిలో దించాల్సి వస్తోంది.  

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)