Breaking News

కోచ్‌గా స్టిమాక్‌ కొనసాగింపు! 

Published on Sat, 03/30/2024 - 01:26

న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్‌ జట్టు మైదానంలో నిరాశాజనక ఫలితాలు సాధిస్తున్నప్పటికీ... కోచ్‌గా ఐగర్‌ స్టిమాక్‌ కొనసాగనున్నారు. 2026 ఫిఫా ప్రపంచకప్‌ ఆసియా క్వాలిఫయర్స్‌లో అఫ్గానిస్తాన్‌లాంటి చిన్న జట్టుతో ఓటమి పాలవడం ఆయన కోచ్‌ పదవికి ఎసరు తెచ్చింది. అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) సాంకేతిక కమిటీ కూడా హెడ్‌ కోచ్‌ను తప్పించాలనే సిఫార్సు చేసింది.

అయితే ఒప్పంద నిబంధనలు ఆయన్ని ఉన్నపళంగా తప్పిస్తే భారీ మూల్యం చెల్లించేలా ఉన్నాయి. దీంతో వేటు కంటే కొనసాగించడమే మేలని ఏఐఎఫ్‌ఎఫ్‌ భావిస్తోంది. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టిమాక్‌ ఇన్‌చార్జ్‌గా జూన్‌ వరకు జట్టుతో కలిసి పనిచేస్తారు’ అని ఏఐఎఫ్‌ఎఫ్‌ అధికారి ఒకరు తెలిపారు. జూన్‌లో ఆసియా క్వాలిఫయర్స్‌కు సంబంధించిన రెండు మ్యాచ్‌లు ఉన్నాయి.

గ్రూప్‌ ‘ఎ’లో భారత్‌... కువైట్, ఖతర్‌లతో తలపడాల్సివుంటుంది. ఈ ఫలితాలను బట్టే తదుపరి మూడో రౌండ్‌కు అర్హత సాధించేది లేనిది తేలుతుంది. అఫ్గానిస్తాన్‌తో ఇంటా బయటా జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ నిరాశపరిచింది. అఫ్గాన్‌కు సంబంధించిన హోమ్‌ మ్యాచ్‌ సౌదీలో జరగ్గా భారత్‌ డ్రా చేసుకుంది.

Videos

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)