మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో స్టీవ్‌ స్మిత్‌.. వాషింగ్టన్‌ ఫ్రీడంతో ఒప్పందం

Published on Thu, 04/11/2024 - 15:51

ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ అమెరికాలో జరిగే మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో పాల్గొననున్నాడు. వాషింగ్టన్‌ ఫ్రీడం​ ఫ్రాంచైజీ స్టీవ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది జులై 4 నుంచి ప్రారంభంకాబోయే ఎంఎల్‌సీ రెండో సీజన్‌లో స్టీవ్‌ బరిలోకి దిగనున్నాడు. స్టీవ్ ఎంఎల్‌సీ అరంగేట్రం సీజన్‌లో ఇదే వాషింగ్టన్‌ ఫ్రీడంకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించాడు.

వాషింగ్టన్‌ ఫ్రీడంకు ఆసీస్‌ ఆటగాడు మోసెస్‌ హెన్రిక్స్‌ కెప్టెన్సీ వహిస్తుండగా.. ఆసీస్‌ దిగ్గజం రికీ పాంటింగ్‌ హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ జట్టులో హెన్రిక్స్‌తో పాటు మరో ముగ్గురు ఆసీస్‌ ఆటగాళ్లు కూడా ఉన్నారు. తన్వీర్‌ సంగా, బెన్‌ డ్వార్షుయిస్‌, జోష్‌ ఫిలిప్‌ ఇదే ఫ్రాంచైజీకి ఆడుతున్నారు. వచ్చే సీజన్‌ నుంచి స్టీవ్‌ వీరితో జతకట్టనున్నాడు.‍ ఎంఎల్‌సీ రెండో సీజన్‌ కోసం మరో ముగ్గురు ఆసీస్‌ ఆటగాళ్లు వేర్వేరు ఫ్రాంచైజీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆడమ్‌ జంపా, స్పెన్సర్‌ జాన్సన్‌ లాస్‌ ఏంజెల్స్‌ నైట్‌రైడర్స్‌తో.. టిమ్‌ డేవిడ్‌ ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్‌ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 

కాగా, స్టీవ్‌ ఇటీవలికాలంలో పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అతను జాతీయ జట్టులో చోటు ఆశిస్తున్నప్పటికీ అవకాశాలు రావడం లేదు. లీగ్‌ క్రికెట్‌లో సైతం ఫ్రాంచైజీలు ఇతనికి ఆసక్తి చూపడం లేదు. ఐపీఎల్‌ 2024 సీజన్‌ వేలంలో స్టీవ్‌ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. నిదానంగా బ్యాటింగ్‌ చేస్తాడనే కారణంగా ఏ ఫ్రాంచైజీ స్టీవ్‌ను సొంతం చేసుకోవడం లేదు. స్టీవ్‌ టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో చోటు ఆశిస్తున్నప్పటికీ అవకాశం లభించేలా లేదు. ఆసీస్‌ టాపార్డర్‌ బెర్తులు ట్రవిస్‌ హెడ్‌, డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌లతో భర్తీ అయ్యాయి.  
 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)