Breaking News

స్టీవ్‌ స్మిత్‌కు షాక్‌.. ఆసీస్‌ వరల్డ్‌కప్‌ జట్టులోకి విధ్వంసకర ఆటగాడు..!

Published on Mon, 04/29/2024 - 13:01

ఆసీస్‌ సెలెక్టర్లు తమ స్టార్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌కు భారీ షాకివ్వనున్నారని తెలుస్తుంది. వరల్డ్‌కప్‌ జట్టులో స్మిత్‌ స్థానం​ గల్లంతు కావడం ఖాయమని ఆసీస్‌ మీడియా కోడై కూస్తుంది. స్మిత్‌ స్థానంలో ఐపీఎల్‌ నయా సెన్సేషన్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ విధ్వంసకర ఆటగాడు జేక్‌ ఫ్రేసర్‌ వరల్డ్‌కప్‌ జట్టులోకి వస్తాడని సమాచారం. 

జట్టు ప్రకటనకు మే 1 డెడ్‌లైన్‌ కావడంతో అన్ని జట్ల సెలెక్టర్లు తమతమ జట్లను ఫైనల్‌ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో ఆసీస్‌ సెలెక్టర్లు తమ జట్టుకు తుది రూపు తెచ్చినట్లు సమాచారం. నేడో రేపో 15 మంది సభ్యులతో కూడిన ఆసీస్‌ ప్రపంచకప్‌ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. 

న్యూజిలాండ్‌ ఇవాళే తమ వరల్డ్‌కప్‌ జట్టును ప్రకటించగా.. టీమిండియాను ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం ప్రకటించే ఛాన్స్‌ ఉంది. ఈసారి టీమిండియా వరల్డ్‌కప్‌ జట్టుపై​ జనాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 

ఒకరిద్దరి విషయంలో అభిమానులు చాలా పర్టికులర్‌గా ఉన్నారు. శివమ్‌ దూబే, రింకూ సింగ్‌ లాంటి ఆటగాళ్లను వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపిక చేయాలని పెద్ద ఎత్తును డిమాండ్లు వినిపిస్తున్నాయి. హార్దిక్‌, సంజూ శాంసన్‌, రిషబ్‌ పంత్‌ విషయంలో సెలెక్టర్ల నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

స్మిత్‌ విషయానికొస్తే.. ఈ ఆసీస్‌ స్టార్‌ను ఐపీఎల్‌ 2024 వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. స్మిత్‌ ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. ఇటీవలే స్మిత్‌కు జాతీయ జట్టు ఓపెనర్‌గా ప్రమోషన్‌ లభించినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. నిదానంగా ఆడతాడన్న ముద్ర స్మిత్‌పై ఉండనే ఉంది. స్మిత్‌కు ప్రత్యామ్నాయాలు కూడా ఆసీస్‌కు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌ జట్టులో స్మిత్‌కు స్థానం దొరకకపోవడం ఆశ్చర్యకరమేమీ కాదు.

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)