Breaking News

చరిత్ర సృష్టించిన స్టీవ్‌ స్మిత్‌

Published on Sat, 12/06/2025 - 09:44

ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ (Steve Smith) చరిత్ర సృష్టించాడు. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసీస్‌ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. యాషెస్‌ రెండో టెస్ట్‌ సందర్భంగా ఈ ఘనత సాధించాడు. లబూషేన్‌ ఖాతాలో ఉన్న ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రస్తుతం లబూషేన్‌ ఖాతాలో 4350 పరుగులు ఉండగా.. స్టీవ్‌ ఖాతాలో 4358 పరుగులు ఉన్నాయి. ఓవరాల్‌గా డబ్ల్యూటీసీ అత్యధిక పరుగుల రికార్డు ఇంగ్లండ్‌ దిగ్గజం జో రూట్‌ పేరిట ఉంది. ప్రస్తుతం రూట్‌ ఖాతాలో 6226 పరుగులు ఉన్నాయి. రూట్‌కు రెండో స్థానంలో ఉన్న స్టీవ్‌కు మధ్య దాదాపు 2000 పరుగుల వ్యత్యాసం ఉండటం విశేషం.

హోరాహోరీగా సాగుతున్న మ్యాచ్‌
బ్రిస్బేన్‌ వేదికగా జరుగుతున్న యాషెస్‌ రెండో టెస్ట్‌ హోరాహోరీగా సాగుతోంది. రెండో రోజు ఆటలో ఇంగ్లీష్ జట్టుపై కంగారులు పైచేయి సాధించారు.  ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయి 378 పరుగులు చేసి, 44 పరుగుల ఆధిక్యంలో ఉంది.

క్రీజులో అలెక్స్ కారీ (46), నీసర్‌ (15) ఉన్నారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో  జేక్ వెదరాల్డ్ (72), మార్నస్ లబుషేన్ (65), స్టీవ్ స్మిత్ (61) హాఫ్ సెంచరీలతో రాణించారు. ట్రావిస్ హెడ్ 33 పరుగులకే పరిమితయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 3, స్టోక్స్ 2, ఆర్చర్ ఓ వికెట్ తీశారు.

అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 334 పరుగుల వద్ద ఆలౌటైంది. జో రూట్‌(138) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. జాక్ క్రాలీ(76),ఆర్చర్‌(38) రాణించారు. మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో సత్తా చాటాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్టులో ఇంగ్లండ్‌ను ఆసీస్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే.

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)