Breaking News

చరిత్ర సృష్టించిన స్మిత్‌.. విలియమ్సన్‌, మార్క్‌వా రికార్డులు బద్దలు

Published on Sun, 12/15/2024 - 12:53

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట‌ర్ స్టీవ్ స్మిత్ ఎట్ట‌కేల‌కు తిరిగి త‌న ఫామ్‌ను  అందుకున్నాడు. బ్రిస్బేన్ వేదిక‌గా టీమిండియాతో జ‌రుగుతున్న మూడో టెస్టులో స్మిత్ అద్బుత‌మైన సెంచ‌రీతో మెరిశాడు. స్మిత్‌కు ఇది 25 ఇన్నింగ్స్‌ల త‌ర్వాత వ‌చ్చిన టెస్టు సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం.

స్మిత్‌ చివ‌ర‌గా 2023 జూన్‌లో యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌పై చివరి సెంచరీ సాధించాడు. మ‌ళ్లీ ఇప్పుడు దాదాపు ఏడాదిన్నర త‌ర్వాత‌ మూడెంకెల స్కోర్‌ను స్మిత్ అందుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 190 బంతులు ఎదుర్కొన్న స్మిత్‌.. 12 ఫోర్ల సాయంతో 101 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. స్మిత్‌కు ఇది భార‌త్‌పై 10వ సెంచ‌రీ కాగా.. ఓవ‌రాల్‌గా 33వ టెస్టు సెంచరీ. ఈ క్ర‌మంలో స్మిత్ ప‌లు అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

స్మిత్‌ అరుదైన రికార్డులు..
టెస్టుల్లో టీమిండియాపై అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లండ్‌ స్టార్‌ జోరూట్‌ రికార్డును స్మిత్‌ సమం చేశాడు. రూట్ 55 ఇన్నింగ్స్‌లలో 10 సెంచరీలు నమోదు చేయగా... స్మిత్‌ 41 ఇన్నింగ్స్‌లలో పది శతకాలు సాధించాడు. 

అదే విధంగా ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రెండో స్ధానానికి స్మిత్‌(33) ఎగబాకాడు. ఈ క్రమంలో మార్క్‌ వా(32)ను వెనక్కి నెట్టాడు. ఈ జాబితాలో మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌(41) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో పదకుండో స్ధానంలో స్మిత్‌(33) కొనసాగుతున్నాడు. ఈ సెంచరీతో కేన్‌ విలియమ్సన్‌(32)ను స్మిత్‌ వెనక్కి నెట్టాడు.

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)