Breaking News

చరిత్ర సృష్టించిన స్మిత్‌.. ప్రపంచంలో తొలి ప్లేయర్‌గా

Published on Sun, 02/09/2025 - 11:39

టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయ‌ర్, స్టాండింగ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steve Smith) ప‌రుగులు వ‌ర‌ద పారిస్తున్నాడు. శ్రీలంక‌తో తొలి టెస్టు సూప‌ర్‌ సెంచ‌రీతో మెరిసిన స్మిత్‌.. రెండో టెస్టులోనూ త‌న బ్యాట్‌కు ప‌నిచెప్పాడు.

ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో స్మిత్ అద్బుత‌మైన శ‌త‌కంతో చెల‌రేగాడు. 254 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 131 పరుగులు చేశాడు. కాగా మొద‌టి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ జట్టు 91 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో స్మిత్ అలెక్స్ క్యారీతో కలిసి నాలుగో వికెట్‌కు 259 పరుగులు జోడించాడు. 

తద్వారా ఓ అరుదైన స్మిత్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 11 మంది ఆటగాళ్లతో 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తొలి బ్యాటర్‌గా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన​ రికీ పాంటింగ్ పేరిట ఉండేది. పాంటింగ్ టెస్టుల్లో 10 మంది ఆటగాళ్లతో కలిసి 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తాజా మ్యాచ్‌తో రికీ ఆల్‌టైమ్ రికార్డును స్మిత్ బ్రేక్ చేశాడు.

చ‌రిత్ర సృష్టించిన అలెక్స్‌-స్మిత్‌..
అదే విధంగా ఈ మ్యాచ్‌లో అభేధ్యమైన భాగస్వామ్యం నెలకొల్పిన అలెక్స్ క్యారీ, స్టీవ్ స్మిత్ జోడీ సైతం ఓ అరుదైన ఫీట్‌ను తమ పేరిట లిఖించుకున్నారు. శ్రీలంక గడ్డపై నాలుగో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన పర్యాటక జట్టు జోడీ వీరిద్దరూ నిలిచారు.

గతంలో ఈ రికార్డు మైకెల్ హస్సీ-షాన్ మార్ష్ పేరిట ఉండేది. 2011లో పల్లెకెలె వేదికగా జరిగిన మ్యాచ్‌లో  హస్సీ-షాన్ మార్ష్ 258 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తాజా మ్యాచ్‌తో దిగ్గజ క్రికెటర్ల రికార్డును స్మిత్‌-అలెక్స్ జోడీ బ్రేక్ చేశారు.

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)