Breaking News

లంచ్‌ విరామం.. స్మిత్‌ సెంచరీ, ఆస్ట్రేలియా 416 ఆలౌట్‌

Published on Thu, 06/29/2023 - 18:02

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌట్‌ అయింది. స్టీవ్‌ స్మిత్‌ 110 పరుగులతో సెంచరీ చేయగా.. ట్రెవిస్‌ హెడ్‌ 77, డేవిడ్‌ వార్నర్‌ 66 పరుగులు చేశారు. 339/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండోరోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ తొలి సెషన్‌లోనే తమ పోరాటాన్ని ముగించింది.

రెండోరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే అలెక్స్‌ కేరీ వెనుదిరిగాడు. ఆ తర్వాత స్టార్క్‌ కూడా 6 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో కమిన్స్‌ స్మిత్‌కు జత కలిశాడు. ఇద్దరు కలిసి 8వ వికెట్‌కు 35 పరుగులు జోడించి జట్టు స్కోరును 400 దాటించారు. ఈ దశలో స్మిత్‌ టెస్టుల్లో 32వ సెంచరీ మార్క్‌ను సాధించాడు.

అయితే కాసేపటికే స్మిత్‌ ఔట్‌ కావడం.. తర్వాత ఇంగ్లండ్‌ బౌలర్లు టెయిలెండర్ల పని కానిచ్చారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోష్‌ టంగ్‌, ఓలీ రాబిన్సన్‌లు చెరో మూడు వికెట్లు తీయగా.. జో రూట్‌ 2, అండర్సన్‌, బ్రాడ్‌లు ఒక్కో వికెట్‌ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ లంచ్‌ విరామ సమయానికి వికెట్‌ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. జాక్‌ క్రాలీ 6, బెన్‌ డకెట్‌ ఏడు పరుగులతో ఆడుతున్నారు.

చదవండి: టెస్టుల్లో 32వ సెంచరీ.. ఆస్ట్రేలియన్‌ దిగ్గజం సరసన 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)