Breaking News

స్టీవ్‌ స్మిత్‌ వివాదాస్పద క్యాచ్‌.. థర్డ్‌ అంపైర్‌ కళ్లకు గంతలు!

Published on Fri, 06/30/2023 - 19:42

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 325 పరుగులకే పరిమితం చేసిన ఆసీస్‌ 91 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆసీస్‌ వికెట్‌ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. ప్రస్తుతం 149 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆసీస్‌ పట్టు బిగించేలా కనిపిస్తోంది.

ఈ విషయం పక్కనబెడితే.. ఇటీవలే ఆస్ట్రేలియా ఆటగాళ్లు తీసుకుంటున్న పలు క్యాచ్‌లు వివాదాస్పదంగా మారుతున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో గిల్‌ క్యాచ్‌ను గ్రీన్‌ అందుకున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం యాషెస్‌ సిరీస్‌లోనూ బర్మింగ్‌హమ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ మళ్లీ గ్రీన్‌ మరో వివాదాస్పద క్యాచ్‌తో వార్తల్లో నిలిచాడు. బెన్‌ డక్కెట్‌ ఇచ్చిన క్యాచ్‌ను థర్డ్‌ స్లిప్‌లో ఉన్న గ్రీన్‌ అందుకున్నాడు. అయితే బంతి నేలను తాకినట్లు క్లియర్‌గా ఉన్నా థర్డ్‌ అంపైర్‌ మరోసారి గ్రీన్‌కే ఓటు వేశాడు. ఈ రెండు స​ందర్భాల్లో గ్రీన్‌ విలన్‌గా మారితే.. తాజాగా స్టీవ్‌ స్మిత్‌ వివాదాస్పద క్యాచ్‌ల జాబితాలో చేరాడు. 

తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 416 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో మంచి ఆరంభం లభించింది. అయితే రూట్‌ (10 పరుగులు) ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. స్టార్క్‌ వేసిన బంతిని(46.3వ ఓవర్‌లో) రూట్‌ ఎదుర్కొనే క్రమంలో బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ వద్ద స్మిత్‌ చేతికి చిక్కాడు. అయితే క్యాచ్‌ అందుకున్న విధానంపై అనుమానంతో ఫీల్డ్‌ అంపైర్లు నిర్ణయాన్ని థర్డ్‌ అంపైర్‌కు నివేదించారు. రిప్లేను పరిశీలించిన థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. రిప్లేలో బంతి నేలను తాకుతుందని క్లియర్‌గా తెలుస్తున్నప్పటికి.. ఔట్‌ ఇవ్వడం ఏంటని ఇంగ్లండ్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)