Breaking News

ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌..

Published on Thu, 01/09/2025 - 09:19

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌లో ఆస్ట్రేలియా  తమ ఆఖరి సిరీస్‌కు సిద్దమవుతోంది. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న ఆసీస్‌.. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఇరు జట్ల మధ్య జనవరి 29 నుంచి ఈ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

ఈ క్రమంలో లంకతో సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ టూర్‌కు రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(Pat cummins) దూరమయ్యాడు. అతడి భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుండడంతో ఈ సిరీస్ నుంచి కమ్మిన్స్ తప్పుకున్నాడు. అతడి స్దానంలో స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith ) ఎంపికయ్యాడు.

స్టార్క్‌కు నో రెస్ట్‌..
అదే విధంగా ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆడనున్నాడు. తొలుత అతడికి విశ్రాంతి ఇస్తారని వార్తలు వినిపించినప్పటికి, ఆసీస్ సెలక్టర్లు మాత్రం జట్టులో కొనసాగించారు. మరోవైపు స్టార్‌​ ‍పేసర్ జోష్ హాజిల్‌వుడ్ ప్రక్కటెముకుల గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు.

భారత్‌తో జరిగిన సిరీస్‌లో గాయపడిన హాజిల్‌వుడ్‌.. ఇంకా కోలుకోవడానికి నెల రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అతడు తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో రానున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు వెల్లడించాయి. ఈ లంక సిరీస్‌కు ఎంపికైన జట్టులో మిచెల్ స్టార్క్, సీన్ అబాట్, స్కాట్ బోలాండ్ ఫ్రంట్‌లైన్ పేసర్లగా ఉన్నారు.

యువ సంచలనానికి పిలుపు..
ఆస్ట్రేలియా అండర్‌-19 జట్టు మాజీ కెప్టెన్ కూపర్ కొన్నోలీకి తొలిసారి సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఈ 16 మంది సభ్యుల జట్టులో కొన్నోలీకి చోటు దక్కింది. దేశీవాళీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడంతో అతడిని సెలక్టర్లు ఎంపిక చేశారు. కొన్నోలీ ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్‌స్కార్చర్స్ త‌ర‌పున ఆడుతున్నాడు.

ఈ 21 ఏళ్ల కొన్నోలీకి బ్యాటింగ్‌తో అద్బుత‌మైన బౌలింగ్ సిల్క్స్ కూడా ఉన్నాయి. ఇక భార‌త్‌తో టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్న స్పిన్న‌ర్లు మాట్ కుహ్నెమాన్, టాడ్ మర్ఫీ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చారు. అదేవిధంగా బీజీటీలో అద‌ర‌గొట్టిన సామ్ కాన్‌స్టాస్‌, వెబ్‌స్టార్‌ల‌ను శ్రీలంక సిరీస్‌కు కూడా ఆసీస్ సెల‌క్ట‌ర్లు కొన‌సాగించారు.

ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్‌), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్ (వైస్ కెప్టెన్‌), జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లాబుషేన్‌, నాథన్ లియోన్, నాథన్ మెక్‌స్వీనీ, టాడ్ మ‌ర్ఫీ , మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్
చదవండి: 'రోహిత్‌ నిర్ణయం సరైనది కాదు.. ఇక టెస్టులకు విడ్కోలు పలికితే బెటర్‌'

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)