Breaking News

చరిత్ర సృష్టించిన స్టీవ్‌ స్మిత్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

Published on Tue, 01/06/2026 - 21:25

సిడ్నీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ ఐదో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టీవ్ స్మిత్‌.. తనదైన శైలిలో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. గ్రీన్‌, వెబ్‌స్టెర్‌తో కలిసి స్కోర్ బోర్డును అతడు పరుగులు పెట్టించాడు.

ఈ క్రమంలో స్మిత్‌ 165 బంతుల్లోనే తన 37వ టెస్టు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. స్మిత్ 129 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. స్మిత్‌తో పాటు స్టార్ ఓపెనర్ ట్రావెస్ హెడ్(163) కూడా భారీ శతకంతో చెలరేగాడు. ఫలితంగా ఆసీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 518 పరుగులు సాధించింది. కంగారులు ఇంగ్లండ్ కంటే 134 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో శతక్కొట్టిన స్మిత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 

వరల్డ్‌ రికార్డు బ్రేక్‌..
అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లలో కలిపి) ఇంగ్లండ్‌ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా స్మిత్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో స్మిత్‌ ఆస్ట్రేలియా దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్‌(5,028) అధిగమించాడు. స్మిత్ ఇప్పటివరకు ఇంగ్లండ్‌పై మూడు ఫార్మాట్‌లు కలిపి 5,085 పరుగులు చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు
స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) - 5085 పరుగులు
డాన్ బ్రాడ్‌మాన్ (ఆస్ట్రేలియా) - 5028 పరుగులు
అల్లన్ బోర్డర్ (ఆస్ట్రేలియా) - 4850 పరుగులు
వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్) - 4488 పరుగులు
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 4141 పరుగులు
విరాట్ కోహ్లీ (భారత్‌) - 4036 పరుగులు
సచిన్ టెండూల్కర్ (భారత్‌) - 3990 పరుగులు

👉అదేవిధంగా టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో ఆరో స్ధానానికి స్మిత్ ఎగబాకాడు. ఈ జాబితాలో స్మిత్‌ కంటే ముందు సంగక్కర(38), జో రూట్‌(41), పాంటింగ్‌(41), కల్లిస్‌(45), సచిన్‌ టెండూల్కర్‌(51) ఉన్నారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)