Breaking News

కోహ్లి వికెట్‌.. స్మిత్‌కు రికార్డు అందించిన వేళ

Published on Sun, 06/11/2023 - 16:16

ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో కోహ్లి క్యాచ్‌ తీసుకోవడం ద్వారా టెస్టు క్రికెట్‌లో ఆసీస్‌ తరపున అత్యధిక క్యాచ్‌లు అందుకున్న జాబితాలో స్మిత్‌ మూడో స్థానానికి చేరుకున్నాడు.

కోహ్లి క్యాచ్‌ స్మిత్‌కు 157వది. తొలి స్థానంలో రికీ పాంటింగ్‌ 196 క్యాచ్‌లతో ఉ‍న్నాడు. 181 క్యాచ్‌లతో మార్క్‌ వా రెండో స్థానంలో ఉండగా.. మార్క్‌ టేలర్‌తో కలసి స్టీవ్‌ స్మిత్‌ 157 క్యాచ్‌లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. అలెన్‌ బోర్డర్‌ 156 క్యాచ్‌లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. 

ఇక డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓడుతుందా లేక మ్యాచ్‌ డ్రా చేసుకుంటుందా అన్నది చూడాలి. కోహ్లి ఉన్నంతవరకు గెలుపుపై ఆశలు ఉన్నా అతను ఔట్‌ కావడం టీమిండియాకు దెబ్బ అని చెప్పొచ్చు. ఇక రిస్క్‌ తీసుకోకుండా డ్రా కోసం ఆడితే మంచిదని అభిమానులు అభిప్రాయపడ్డారు. ఐదోరోజు ఆట ప్రారంభమైన తర్వాత స్కాట్‌ బోలాండ్‌ బౌలింగ్‌లో కోహ్లి తన ఆఫ్‌స్టంప్‌ బలహీనతను మరోసారి బయటపెట్టాడు. కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను స్మిత్‌ అద్బుతంగా డైవ్‌ చేస్తూ అందుకున్నాడు. 

చదవండి: 'చీటింగ్‌ అనే పదం వాళ్ల బ్లడ్‌లోనే ఉంది!'

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)