Breaking News

వరుస సెంచరీలు.. చరిత్ర సృష్టించిన విండీస్‌ బ్యాటర్‌

Published on Thu, 07/16/2026 - 15:07

వెస్టిండీస్ మహిళల క్రికెట్ దిగ్గజం స్టెఫానీ టేలర్ అరుదైన మైలురాయిని తాకింది. ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో సూపర్‌ సెంచరీ (105) చేసిన ఆమె.. అంతర్జాతీయ క్రికెట్‌లో 10000 పరుగులు పూర్తి చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి వెస్టిండీస్ మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఐదో ప్లేయర్‌గా నిలిచింది.

ఈ జాబితాలో ఇప్పటికే మిథాలీ రాజ్ (10868), సుజీ బేట్స్ (10740), స్మృతి మంధాన (10737), షార్లెట్ ఎడ్వర్డ్స్ (10273) ఉన్నారు. 35 ఏళ్ల టేలర్ అన్ని ఫార్మాట్లలో కలిపి 307 ఇన్నింగ్స్‌ల్లో 10005 పరుగులు చేసింది. అదనంగా ఆమె మూడు ఫార్మాట్లలో కలిపి 254 వికెట్లు కూడా తీసింది.

2008లో ఐర్లాండ్‌పైనే వన్డే అరంగేట్రం చేసిన టేలర్, ఇప్పటివరకు 179 వన్డేల్లో 6339 పరుగులు సాధించింది. ఇందులో 10 శతకాలు, 42 అర్ధశతకాలు ఉన్నాయి. టీ20 అంతర్జాతీయాల్లో 139 మ్యాచ్‌ల్లో 3666 పరుగులు చేసి 22 అర్ధశతకాలు నమోదు చేసింది.

ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టేలక్‌ సెంచరీ చేయడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 257 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఐర్లాండ్‌ను 193 పరుగులకే కుప్పకూల్చి 64 పరుగుల తేడో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది.

అంతకుముందు రెండో వన్డేలోనూ టేలర్ అజేయ శతకం (100*) సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)