Breaking News

శ్రీనిధి డెక్కన్‌ ఎఫ్‌సీ జట్టును గట్టెక్కించిన కాస్టనెడా

Published on Mon, 03/24/2025 - 04:08

పనాజీ: ఐ–లీగ్‌ జాతీయ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) జట్టు ఆరో ‘డ్రా’ నమోదు చేసుకుంది. చర్చిల్‌ బ్రదర్స్‌ ఎఫ్‌సీ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌ను శ్రీనిధి డెక్కన్‌ ఎఫ్‌సీ జట్టు 1–1 గోల్స్‌తో ‘డ్రా’ చేసుకుంది. ఇంటర్‌ కాశీ జట్టుతో జరిగిన గత మ్యాచ్‌లో స్టాపేజ్‌ టైమ్‌లో గోల్‌ సమరి్పంచుకొని గెలవాల్సిన మ్యాచ్‌ను శ్రీనిధి జట్టు ‘డ్రా’తో సరిపెట్టుకోగా... చర్చిల్‌ బ్రదర్స్‌ జట్టుతో స్టాపేజ్‌ టైమ్‌లో (90+11వ నిమిషంలో) గోల్‌ సాధించి ఓడిపోవాల్సిన మ్యాచ్‌లో ‘డ్రా’తో గట్టెక్కింది. 

స్టాపేజ్‌ టైమ్‌లో లభించిన పెనాల్టీ కిక్‌ను శ్రీనిధి డెక్కన్‌ జట్టు స్టార్‌ ప్లేయర్‌ డేవిడ్‌ కాస్టనెడా గోల్‌గా మలిచాడు. ఈ లీగ్‌లో ‘టాప్‌ గోల్‌స్కోరర్‌’గా కొనసాగుతున్న కాస్టనెడాకిది 15వ గోల్‌ కావడం విశేషం. అంతకుముందు 29వ నిమిషంలో పాపె గసామా చేసిన గోల్‌తో చర్చిల్‌ బ్రదర్స్‌ జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 

13 జట్లు పోటీపడుతున్న ఐ–లీగ్‌లో శ్రీనిధి డెక్కన్‌ జట్టు 20 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. ఇందులో 7 మ్యాచ్‌ల్లో గెలిచి, 7 మ్యాచ్‌ల్లో ఓడి, 6 మ్యాచ్‌లను ‘డ్రా’గా ముగించి 27 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. శ్రీనిధి జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో ఈనెల 30 గోకులం కేరళ ఎఫ్‌సీ జట్టుతో ఆడుతుంది.    

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)