Breaking News

మహిళా క్రికెటర్‌తో ‘బంధం’.. శ్రీలంక మాజీ ప్లేయర్‌కు భారీ షాక్‌!

Published on Fri, 09/20/2024 - 12:48

శ్రీలంక మాజీ క్రికెటర్‌ దులిప్‌ సమరవీరకు భారీ షాక్‌ తగిలింది. ఆస్ట్రేలియాలో కోచ్‌గా పనిచేస్తున్న అతడిపై క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) 20 ఏళ్ల నిషేధం విధించింది. ఫలితంగా.. రెండు దశాబ్దాల పాటు ఆస్ట్రేలియాలో ఏ స్థాయిలోనూ అతను పనిచేయడానికి వీలుండదు. 

ప్రస్తుతం విక్టోరియా రాష్ట్ర మహిళల జట్టుకు హెడ్‌కోచ్‌గా పనిచేస్తున్న సమరవీర.. ఓ మహిళా క్రికెటర్‌తో బలవంతంగా సంబంధం పెట్టుకోవడంపై సీఏ కన్నెర్ర చేసింది. అంతేకాదు.. సమరవీర తీవ్రమైన అతిక్రమణకు పాల్పడ్డాడని ఆగ్రహించింది. ఇది సీఏ నియమావళికి విరుద్ధమని, క్రికెట్‌ స్ఫూర్తికి విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను అసీస్‌ బోర్డు ఉపేక్షించదని ఒక ప్రకటనలో పేర్కొంది. 

2008 నుంచి ఆస్ట్రేలియా కోచింగ్‌ బృందంలో 
కాగా సమరవీర 1993–1995 మధ్య కాలంలో శ్రీలంక తరఫున ఏడు టెస్టులు, ఐదు వన్డేలు ఆడాడు. తదనంతరం 2008లో ఆస్ట్రేలియాలో కోచింగ్‌ బృందంలో చేరాడు. మొదట క్రికెట్‌ విక్టోరియా మహిళల జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌గా పనిచేశాడు. సుదీర్ఘకాలం పాటు విక్టోరియా జట్టుకు సేవలందించాడు. 

అదే విధంగా.. మహిళల బిగ్‌బాష్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు కోచ్‌గా పనిచేశాడు. రెండు వారాల క్రితం విక్టోరియా సీనియర్‌ మహిళల జట్టుకు హెడ్‌కోచ్‌గా నియమించారు. కానీ ఓ మహిళా క్రికెటర్‌తో పెట్టుకున్న అనుచిత సంబంధం ఆస్ట్రేలియాతో బంధాన్నే తెగదెంపులు చేసింది. నిషేధం కారణంగా.. అతడు రెండు దశాబ్దాల పాటు ఆస్ట్రేలియాలో ఏ స్థాయి జట్టుకు, లీగ్‌లకు, అకాడమీకి, బోర్డుకు పనిచేయడానికి వీలుండదు.  

చదవండి: రూ. 45 లక్షలు ఇస్తేనే భారత్‌కు ఆడతా.. కారణం చెప్పిన నగాల్‌

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)