Breaking News

జయసూర్య జమానాలో పూర్వ వైభవం దిశగా శ్రీలంక

Published on Fri, 02/14/2025 - 18:23

1996 వన్డే వరల్డ్‌ కప్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి, ఏకంగా టైటిల్‌నే ఎగరేసుకుపోయిన శ్రీలంక.. ఆతర్వాత రెండు దశాబ్దాల పాటు వన్డే క్రికెట్‌లో అద్భుత విజయాలు సాధించింది. 1999 వరల్డ్‌కప్‌లో గ్రూప్‌ స్టేజ్‌లో పరిమితమైన లంకేయులు.. 2003లో సెమీస్‌కు.. 2007, 2011 ప్రపంచకప్‌ల్లో ఫైనల్స్‌కు చేరారు. 2015 వరల్డ్‌కప్‌ వరకు  వన్డేల్లో లంక ప్రయాణం సాఫీగా సాగింది.

అయితే గత దశాబ్దకాలంలో ఆ జట్టు శోభ మసకబారింది. సంగక్కర, జయవర్దనే లాంటి స్టార్‌ ఆటగాళ్ల రిటైర్మెంట్‌తో శ్రీలంక బలహీన జట్టుగా మారిపోయింది. భారత్‌లో జరిగిన 2023 వరల్డ్‌కప్‌కు క్వాలిఫయర్స్‌ ద్వారా అర్హత సాధించింది. ఘన కీర్తి కలిగిన శ్రీలంక క్వాలిఫయర్స్‌ ద్వారా ప్రపంచకప్‌లో పోటీపడటం.. అక్కడ కూడా దారుణ పరాజయాలు మూటగట్టుకోవడంతో ఈ జట్టు పనైపోయిందని అంతా అనుకున్నారు.

అయితే దిగ్గజ ఆటగాడు సనత్‌ జయసూర్య రాకతో (హెడ్‌ కోచ్‌గా) శ్రీలంక ప్రదర్శనల్లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. టెస్ట్‌లు, టీ20ల విషయాన్ని పక్కన పెడితే..  ద్వీప జట్టు వన్డేల్లో అమోఘంగా రాణిస్తుంది. జయసూర్య జమానాలో శ్రీలంక.. భారత్‌, న్యూజిలాండ్‌ లాంటి పటిష్ట జట్లను మట్టికరిపించింది. తాజాగా శ్రీలంక.. ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించింది.

రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్‌ స్వీప్ చేసింది. గతేడాది ఈ జట్టు భారత్‌ను సైతం 2-0 తేడాతో ఓడించింది. ప్రస్తుతం లంక జట్టులో ఉన్న ఆటగాళ్లు పాతవారే అయినప్పటికీ జయసూర్య ఆధ్వర్యంలో వారు రాటుదేలుతున్నారు. నిస్సంక, కుసాల్‌ మెండిస్‌, కమిందు మెండిస్‌, చరిత్‌ అసలంక బ్యాటింగ్‌లో అద్భుతాలు చేస్తున్నారు. లంక జట్టు బౌలింగ్‌ గతంలో పోలిస్తే మరింత బలపడింది. నాణ్యమైన స్పిన్నర్లు తయారవుతున్నారు. మొదటి నుంచే ఆ జట్టు పేస్‌ విభాగం బలంగా ఉంది.

జయసూర్య రాక ముందు చిన్న జట్ల చేతుల్లో సైతం ఘోర పరాజయాలను ఎదుర్కొన్న శ్రీలంక.. త్వరలో జరుగబోయే ఛాంపియన్స్‌ ట్రోఫీకి అర్హత సాధించలేకపోయింది. ఈ మెగా టోర్నీలో శ్రీలంక 2002లో భారత్‌తో కలిసి సంయుక్తంగా ఛాంపియన్‌గా నిలిచింది. త్వరలో జరుగబోయే మెగా టోర్నీకి ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ లాంటి చిన్న జట్లు అర్హత సాధించినా, శ్రీలంక మాత్రం క్వాలిఫై కాలేకపోయింది. 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీకి శ్రీలంకతో పాటు ఘన చరిత్ర కలిగిన వెస్టిండీస్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది.

జయసూర్య హెడ్‌ కోచ్‌గా ఉండగా శ్రీలంక సాధించిన విజయాలు
వన్డే సిరీస్‌లో భారత్‌పై 2-0 తేడాతో విజయం
ఇంగ్లండ్‌లో టెస్ట్‌ విజయం
న్యూజిలాండ్‌పై టెస్ట్‌ సిరీస్‌లో విజయం
వెస్టిండీస్‌పై టీ20 సిరీస్‌ విజయం
వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ 2-1 తేడాతో విజయం
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ డ్రా
న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ 2-0 తేడాతో విజయం​
ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ 2-0 తేడాతో విజయం

 

 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)