Breaking News

ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్‌ ఎవరంటే..?

Published on Thu, 01/01/2026 - 14:35

నమీబియా, జింబాబ్వే వేదికలుగా జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరుగబోయే 2026 అండర్‌ 19 క్రికెట్‌ వరల్డ్‌కప్‌ కోసం 15 మం​ది సభ్యుల శ్రీలంక జట్టును ఇవాళ (జనవరి 1) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా విమత్ దిన్సరా ఎంపిక కాగా.. అతనికి డిప్యూటీగా (వైస్‌ కెప్టెన్‌) కవిజ గమగే నియమితుడయ్యాడు.

ప్రపంచకప్‌లో శ్రీలంక.. జపాన్‌, ఐర్లాండ్‌, ఆస్ట్రేలియాతో కలిసి గ్రూప్‌-ఏలో పోటీపడుతుంది. ఈ మెగా టోర్నీ కోసం లంక జట్టు ఇవాళే నమీబియాకు బయల్దేరనుంది. ముందుగా వెళితే అక్కడి పరిస్థితులకు అలవాటు పడవచ్చని లంక బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రపంచకప్‌లో శ్రీలంక ప్రయాణం జనవరి 17న మొదలవుతుంది. ఆ రోజు జరిగే మ్యాచ్‌లో జపాన్‌తో తలపడుతుంది. అనంతరం జనవరి 19న ఐర్లాండ్‌తో, 23న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను ఢీకొంటుంది.

గతేడాది బంగ్లాదేశ్, వెస్టిండీస్‌ వన్డే సిరీస్‌ల్లో​ ఓటమిపాలైనప్పటికీ, ఆసియా కప్‌లో సెమీఫైనల్ వరకు చేరిన లంక యువ జట్టు.. మొదటి వరల్డ్‌కప్ టైటిల్ కోసం బలంగా పోరాడాలని లక్ష్యంగా పెట్టుకుంది.  

జట్టు వివరాలు
- విమత్ దిన్సరా (కెప్టెన్)  
- కవిజ గమగే (వైస్ కెప్టెన్)  
- దిమంత మహవితాన  
- విరాన్ చముదిత  
- దుల్నిత్ సిగేరా  
- చమిక హీంటిగల  
- ఆడమ్ హిల్మీ  
- చమరిందు నెత్సరా  
- సేత్మిక సెనేవిరత్నె  
- కుగథాస్ మాథులన్  
- రసిత్ నిమ్సరా  
- విగ్నేశ్వరన్ ఆకాష్  
- జీవంత శ్రీరామ్  
- సెనుజ వెకునగొడ  
- మలింత సిల్వా  

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)