Breaking News

రాణించిన సమరవిక్రమ.. చెలరేగిన హసరంగ, మాథ్యూస్‌

Published on Mon, 02/19/2024 - 21:14

డంబుల్లా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక జట్టు ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవరల్లో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. మిడిలార్డర్‌ ఆటగాడు సమరవిక్రమ (42 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్దసెంచరీతో రాణించాడు.

ఆఖర్లో హసరంగ (9 బంతుల్లో 22; ఫోర్‌, 2 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్‌ (22 బంతుల్లో 42 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. ఓపెనర్లు పథుమ్‌ నిస్సంక (11 బంతుల్లో 25; 5 ఫోర్లు), కుశాల్‌ మెండిస్‌లకు (14 బంతుల్లో 23; 4 ఫోర్లు) శుభారంభం లభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ధనంజయ డిసిల్వ 14, అసలంక 4 పరుగులు చేసి ఔటయ్యారు.

ఆఫ్ఘన్‌ బౌలర్లలో అజ్మతుల్లా, మొహమ్మద్‌ నబీ తలో రెండు వికెట్లు పడగొట్టగా..  ఫజల్‌ హాక్‌ ఫారూకీ, నవీన్‌ ఉల్‌ హాక్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. అనంతరం ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్‌ 3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్‌ (1), ఇబ్రహీం జద్రాన్‌ (10) ఔట్‌ కాగా.. రహ్మానుల్లా గుర్బాజ్‌ (9), గుల్బదిన్‌ నైబ్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌లో చెలరేగిన ఏంజెలో మాథ్యూస్‌ బౌలింగ్‌లోనూ సత్తా చాటి రెండు వికెట్లు పడగొట్టాడు.

మూడు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో శ్రీలంక తొలి మ్యాచ్‌లో విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.  

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు