Breaking News

SL Vs SA: రసవత్తరంగా దక్షిణాఫ్రికా-శ్రీలంక రెండో టెస్టు

Published on Mon, 12/09/2024 - 07:37

పోర్ట్‌ ఎలిజబెత్‌: ఆధిక్యం చేతులు మారుతూ సాగుతున్న దక్షిణాఫ్రికా, శ్రీలంక టెస్టు రెండో మ్యాచ్‌లో విజయం ఇరు జట్లతో దోబూచులాడుతోంది. ఆదివారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక లక్ష్యానికి 143 పరుగుల దూరంలో నిలవగా... దక్షిణాఫ్రికా గెలుపునకు 5 వికెట్లు కావాల్సి ఉంది.

ఓవర్‌నైట్‌ స్కోరు 191/3తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా చివరకు 86 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ తెంబా బవుమా (116 బంతుల్లో 66; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరవగా... ట్రిస్టన్‌ స్టబ్స్‌ (47; 2 ఫోర్లు), బెడింగ్‌హమ్‌ (35; 3 ఫోర్లు) రాణించారు. 

లంక బౌలర్లలో ప్రభాత్‌ జయసూర్య 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 348 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక ఆదివారం ఆట ముగిసే సమయానికి 52 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.

కమిందు మెండిస్‌ (35; 4 ఫోర్లు, 1 సిక్స్‌), ఏంజెలో మాథ్యూస్‌ (32; 4 ఫోర్లు, 1 సిక్స్‌), దినేశ్‌ చండీమల్‌ (29; 5 ఫోర్లు) రాణించారు. కెప్టెన్‌ ధనంజయ డిసిల్వా (64 బంతుల్లో 39 బ్యాటింగ్‌? 7 ఫోర్లు), కుశాల్‌ మెండిస్‌ (56 బంతుల్లో 39 బ్యాటింగ్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడుతున్నారు.

దక్షిణాప్రికా బౌలర్లలో కేశవ్‌ మహారాజ్, ప్యాటర్‌సన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సోమవారం ఆటకు చివరి రోజు కాగా... చేతిలో ఐదు వికెట్లు ఉన్న శ్రీలంక విజయానికి 143 పరుగుల దూరంలో ఉంది.
చదవండి: అదే మా కొంపముంచింది.. వారు మాకంటే మెర్గుగా ఆడారు: రోహిత్‌

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)