వరల్డ్‌కప్‌కు జట్టును ప్రకటించిన శ్రీలంక.. స్టార్‌ ఆటగాడు రీ ఎంట్రీ

Published on Tue, 09/26/2023 - 12:35

వన్డే ప్రపంచకప్-2023కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్‌ ప్రకటించింది. ఈ జట్టుకు సారథిగా దసున్‌ షనక ఎంపికయ్యాడు. గాయం కారణంగా ఆసియాకప్‌కు దూరమైన స్టార్‌ ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగాకు వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కింది.

అతడితో పాటు మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక కూడా రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే వీరిముగ్గురు తమ ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంది. ఫిట్‌నెస్‌ ప్రూవ్‌ చేసుకుంటేనే టోర్నీలో కొనసాగుతారు. అదే విధంగా రిజర్వ్‌ జాబితాలో దసున్‌ హేమంత, చమిక కరుణ రత్నేకు ఛాన్స్‌ లభించింది.

ఇక మెగా టోర్నీలో పాల్గోనేందుకు శ్రీలంక జట్టు గురువారం భారత గడ్డపై అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌ 29న గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఇక ప్రధాన టోర్నీలో శ్రీలంక తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 7న ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

వరల్డ్‌కప్‌కు శ్రీలంక జట్టు: దసున్ షనక(కెప్టెన్‌), కుసల్ మెండిస్ (వైస్‌ కెప్టెన్‌), పాతుమ్ నిస్సంక, కుసల్ జనిత్, దిముత్ కరుణరత్నే, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వ, సదీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, మతీశ పతిరన, లహిరు కుమార, మహేశ్ తీక్షన, వశీన్ తీక్షన మధుశంక ప్రయాణ నిల్వలు: దుషన్ హేమంత, చమిక కరుణరత్నే


చదవండి: ABD On Kohli ODI Retirement: 'వన్డే ప్రపంచకప్‌ తర్వాత కోహ్లి రిటైర్మెంట్‌'

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)