Breaking News

SL VS PAK: రిటైర్మెంట్‌ ప్రకటించిన శ్రీలంక క్రికెటర్‌

Published on Sat, 07/22/2023 - 16:43

శ్రీలంక ఓపెనింగ్‌ బ్యాటర్‌ లహిరు తిరిమన్నే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు శనివారం ప్రకటించాడు. గత ఏడాది కాలంగా సరైన అవకాశాలు రాకపోవడంతో తిరిమన్నే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లంక వన్డే జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన తిరిమన్నే 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లోని అరంగేట్రం చేసి, దాదాపు 13 ఏళ్ల పాటు లంక క్రికెట్‌కు సేవలందించాడు.

తిరిమన్నే తన కెరీర్లో 44 టెస్ట్‌లు, 127 వన్డేలు, 26 టీ20లు ఆడాడు. ఇందులో దాదాపు 5600 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన తిరిమన్నే.. తన కెరీర్‌లో 3 టెస్ట్‌ సెంచరీలు, 4 వన్డే సెంచరీలతో పాటు అన్ని ఫార్మాట్లలో కలిపి 31 అర్ధసెంచరీలు సాధించాడు. తిరిమన్నే చివరిగా 2022లో బెంగళూరు వేదికగా భారత్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో ఆడాడు.

ఆ మ్యాచ్‌లో 0, 8 పరుగులకే పరిమితమైన అతను జట్టులో స్థానంలో కోల్పోయాడు. తిరిమన్నే తన రిటైర్మెంట్‌ ప్రకటనను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశాడు. 13 ఏళ్ల పాటు దేశానికి ప్రాతినిథ్యం వహించడం గర్వకారణమని పేర్కొన్నాడు. లంక జట్టుతో తన జర్నీలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. 

ఇదిలా ఉంటే, శ్రీలంక  జట్టు ప్రస్తుతం స్వదేశంలో పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడుతుంది. సిరీస్‌లో భాగంగా ఇటీవల ముగిసిన తొలి టెస్ట్‌లో శ్రీలంక.. పాక్‌ చేతిలో ఓటమిపాలైంది. దీనికి ముందు జరిగిన వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో శ్రీలంక ఛాంపియన్‌గా నిలిచి, ఈ ఏడాది చివర్లో భారత్‌ వేదకగ జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)