ఓడినా వణికించింది.. వరల్డ్‌కప్‌ అర్హతకు చేరువలో లంక

Published on Fri, 06/30/2023 - 21:12

వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే అంశంలో శ్రీలంక మరింత దగ్గరైంది. క్రికెట్‌ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో సూపర్‌ సిక్స్‌లో భాగంగా శుక్రవారం నెదర్లాండ్స్‌, శ్రీలంక మధ్య రెండో మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 21 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 214 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ 40 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌట్‌ అయింద.  

ఒక దశలో నెదర్లాండ్స్‌ విజయం దిశగా నడిచి శ్రీలంకను వణికించింది. అయితే లంక బౌలర్లు సమిష్టి ప్రదర్శనతో నెదర్లాండ్స్‌ను నిలువరించారు. కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్‌వర్డ్స్‌ 68 బంతుల్లో 67 పరుగులు చేయగా.. వెస్లీ బార్సీ 52 పరుగులు, బాస్‌ డీ లీడే 41 పరుగుల చేశారు. లంక బౌలర్లలో మహీషా తీక్షణ మూడు వికెట్లు తీయగా.. వనిందు హసరంగా రెండు వికెట్లు పడగొట్టగా.. లాహిరు కుమారా, మధుషనక, షనకలు తలా ఒక వికెట్‌ తీశారు. 

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నెదర్లాండ్స్‌ బౌలర్ల దెబ్బకు పూర్తి ఓవర్లు ఆడకుండానే 213 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఒక దశలో 96 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన లంక అసలు 150 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది.ధనుంజయ డిసిల్వా తన కెరీర్‌ బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 111 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో డిసిల్వా 93 పరుగులు చేశాడు.

ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నప్పటికి వన్డేల్లో కెరీర్‌ బెస్ట్‌ స్కోరును నమోదు చేశాడు. అతనికి అండగా వనిందు హసరంగా 20, మహీశ్‌ తీక్షణ 28 పరుగులు చేశారు. ఓపెనర్‌ కరుణరత్నే 33 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో లోగన్‌ వాన్‌ బీక్‌, బాస్‌ డీ లీడేలు చెరో మూడు వికెట్లు తీయగా.. సాబిక్‌ జుల్పికర్‌ రెండు, రియాన్‌ క్లెయిన్‌, ఆర్యన్‌ దత్‌లు తలా ఒక వికెట్‌ తీశారు. 

ఈ విజయంతో శ్రీలంక వరల్డ్‌కప్‌ అర్హతకు మరింత చేరువైంది. ప్రస్తుతం లంక ఖాతాలో ఆరు పాయింట్లు ఉన్నాయి. ఇక నెదర్లాండ్స్‌ ఓటమితో ఇబ్బందుల్లో పడింది. డచ్‌ తమకు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు ఇతర జట్ల ఓటములపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది.

చదవండి: #Ashes2023: స్టీవ్‌ స్మిత్‌ వివాదాస్పద క్యాచ్‌.. థర్డ్‌ అంపైర్‌ కళ్లకు గంతలు!

దెబ్బకొట్టిన నెదర్లాండ్స్‌; కెరీర్‌ బెస్ట్‌ ప్రదర్శనతో పరువు నిలిపాడు

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)