Breaking News

ఆసియా క్రీడలకు శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్‌ ఎవరంటే?

Published on Tue, 09/19/2023 - 11:56

చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు-2023కు 15 మంది సభ్యులతో కూడిన శ్రీలంక-ఏ జట్టును ఆ దేశ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్‌రౌండర్‌  సహన్ అరాచ్చిగే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సహన్ అరాచ్చిగే శ్రీలంక సీనియర్‌ జట్టు తరపున ఇప్పటివరకు కేవలం 2 వన్డేలు మాత్రమే ఆడాడు. అయితే దేశవాళీ క్రికెట్‌లో మంచి ట్రాక్‌ రికార్డు ఉండడంతో జట్టు పగ్గాలు అతడికి సెలక్టర్లు అప్పగించారు.

అంతేకాకుండా ఆసియాకప్‌-2023 ఫైనల్‌ శ్రీలంక  జట్టులో కూడా అరాచ్చిగే బ్యాకప్‌గా ఉన్నాడు. అదే విధంగా ఆసియా క్రీడల్లో పాల్గోనే శ్రీలంక జట్టులో నువానీడు ఫెర్నాండో,అషెన్ బండార వంటి సీనియర్‌ ఆటగాళ్లు ఉన్నారు. ఇక వన్డే వరల్డ్‌కప్‌-2023కు సమయం ఆసన్నం కావడంతో ద్వితీయ శ్రేణి జట్టును చైనాకు పంపాలని శ్రీలంక సెలక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. కాగా ఆసియాకప్‌ ఫైనల్లో భారత్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో శ్రీలంక ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఈ టోర్నీలో పాల్గోనే తమ మహిళల జట్టును కూడా శ్రీలంక క్రికెట్‌ వెల్లడించింది. ఈ జట్టుకు ఆతపట్టు నాయకత్వం వహించనుంది. ఈ మెగా ఈవెంట్‌ సెప్టెంబర్‌ 23 నుంచి ఆక్టోబర్‌ 8వరకు జరగనుంది.

శ్రీలంక జట్టు: లసిత్ క్రూస్‌పుల్లే, షెవోన్ డేనియల్, అషెన్ బండార, సహన్ అరాచ్చిగే (కెప్టెన్‌), అహన్ విక్రమసింఘే, లహిరు ఉదార ​​(వికెట్‌ కీపర్‌), రవిందు ఫెర్నాండో, రాణిత లియానారాచ్చి, నువానీడు ఫెర్నాండో, సచిత జయతిలకే, విజయకాంత్ వియస్కాంత్, నిమేష్ నూతుస్ర విముక్తి, నిమేష్ నూతుస్ర విముక్తి,
చదవండి: Asia Cup 2023: పాక్‌ క్రికెట్‌లో ముసలం.. బాబర్‌తో విభేదాలు! వైస్‌ కెప్టెన్‌పై వేటు

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)