Breaking News

నితీష్ ఊచ‌కోత‌.. 8 సిక్స్‌లతో వీర విహారం! వీడియో వైర‌ల్‌

Published on Thu, 05/02/2024 - 21:37

ఐపీఎల్‌-2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు, ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీష్‌ కుమార్‌ రెడ్డి మ‌రోసారి విధ్వంసం సృష్టించాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో నితీష్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీష్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. మొదటి ఆచితూచి ఆడిన నితీష్‌.. క్రీజులో సెటిల్ అయ్యాక బౌండరీల వర్షం కురిపించాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్‌తో కలిసి ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 

వరల్డ్‌క్లాస్ స్పిన్నర్లు అశ్విన్‌, చాహల్‌కు అయితే నితీష్ చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో కేవలం 30 బంతుల్లోనే నితీష్ కుమార్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా  41 బంతులు ఎదుర్కొన్న నితీష్‌.. 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. 

అత‌డి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. దీంతో అత‌డిపై అభిమానులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 

ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో నితీష్ కుమార్ రెడ్డితో పాటు ట్రావిస్ హెడ్‌(58), క్లాసెన్‌(28) పరుగులతో సత్తాచాటారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ ఒక్క వికెట్ సాధించాడు.

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)