Breaking News

రెండో మ్యాచ్‌లోనే తిట్ల దండకం అందుకున్న అర్జున్‌ టెండూల్కర్‌.. ఎందుకో చూడండి..!

Published on Wed, 04/19/2023 - 18:46

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో నిన్న (ఏప్రిల్‌ 18) జరిగిన మ్యాచ్‌ సందర్భంగా కెమరాల్లో రికార్డైన ఓ సన్నివేశానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. ఇందులో సచిన్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ కోపంతో ఊగిపోతూ కనిపించాడు. తనపై కెమెరామెన్‌ పదేపదే ఫోకస్‌ చేస్తుండటంతో సహనం కోల్పోయిన అర్జున్‌ తిట్ట దండకం అందుకున్నాడు. ఈ సన్నివేశం ముంబై ఇన్నింగ్స్‌ 2వ ఓవర్‌ సందర్భంగా జరిగనట్లు వీడియో ద్వారా స్పష్టమవుతుంది. 

ఏం జరిగిందంటే..
ముంబై ఇన్నింగ్స్‌ 2వ ఓవర్‌ సందర్భంగా బ్రాడ్‌కాస్టర్‌ అర్జున్‌కు సంబంధించిన ఓ క్లిప్‌ను చూపించాడు. మ్యాచ్‌కు ముందు అర్జున్‌.. తన తండ్రి సచిన్‌తో ఏదో మాట్లాడుతున్న సందర్భమది. ఈ క్లిప్‌ ప్లే చేసిన తర్వాత కెమెరా సచిన్‌పై ఫోకస్‌ కావడంతో కామెంటేటర్‌ రవిశాస్త్రి.. కొనేళ్ల కష్టం తర్వాత కలను సాకారం చేసుకున్న కొడుకును చూడటం తండ్రికి ఎంతో గర్వకారణమని సచిన్‌ ఉద్దేశిస్తూ అన్నాడు.

ఆ మరు క్షణమే డగౌట్‌లో కూర్చున్న అర్జున్‌  ఫేస్‌ను కెమెరామెన్‌ జూమ్‌ చేశాడు. స్టేడియంలోని బిగ్‌ స్క్రీన్లపై తన ముఖం కనబడటంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన అర్జున్‌.. కెమెరామెన్‌పై తిట్ట దండకం అందుకున్నాడు. డగౌట్‌లో తన పక్కను కూర్చున్న తిలక్‌ వర్మవైపు చూస్తూ అర్జున్‌ అసభ్యకరమైన పదజాలాన్ని వాడాడు. ఈ మొత్తం తంతు కెమెరాల్లో రికార్డు కావడం, అది కాస్త సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

అర్జున్‌ ఆడుతున్నది కేవలం రెండో మ్యాచే కాబట్టి, అతనిపై కెమెరాలు పదేపదే ఫోకస్‌ చేస్తే ఒత్తిడికి లోనవుతాడు, అలా చేయడం కెమెరామెన్‌ తప్పేనని కొందరంటుంటే, మరి కొందరేమో.. ఇంత పొగరు పనికిరాదు, సెలెబ్రిటీ కొడుకు అన్న తర్వాత ఆ మాత్రం ఫోకస్‌ ఉంటుందంటూ అర్జున్‌నే తప్పుబడుతున్నారు.

అర్జున్‌ ఏమన్నాడంటే..
వీడియోల్లో కనిపిస్తున్న దాన్ని బట్టి చూస్తే.. “Iski Maa ki, mujhe jaan bujh ke dikhate hai BC" అన్నట్లు తెలుస్తోంది. దీని అర్ధం వర్ణించలేని భాషలో ఉంది. కెమెరామెన్‌ ఉద్దేశపూర్వకంగా నన్ను హైలైట్‌ చేస్తున్నాడు అన్నది దాని అంతర్ధాం.   


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)