Breaking News

IPL 2023: సన్‌రైజర్స్‌ను ఓడించి, ఢిల్లీని గెలిపించింది అతనే..!

Published on Tue, 04/25/2023 - 08:48

ఐపీఎల్‌ 2023లో భాగంగా ఉప్పల్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో నిన్న (ఏప్రిల్‌ 24) మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా డిఫెండ్‌ చేసుకుని, 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో (34 బంతుల్లో 34, 4-0-21-2) రాణించినందుకు గాను జట్టు వైస్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 

అక్షర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించినప్పటికీ, ఢిల్లీని గెలిపించింది మాత్రం ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన ముకేశ్‌ కుమారేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒత్తిడిలో చివరి ఓవర్‌ బౌల్‌ చేసిన ముకేశ్‌ అద్భుతమైన యార్కర్‌ బంతులను సంధించి, సన్‌రైజర్స్‌ను గెలవనీయకుండా చేశాడని అంటున్నారు. 

ఆఖరి ఓవర్‌లో కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని (13 పరుగులు) ముకేశ్‌ అద్భుతంగా డిఫెండ్‌ చేశాడని (5 పరుగులు మాత్రమే ఇచ్చాడు), ఢిల్లీపై ఫీల్డింగ్‌ పెనాల్టీ (30 యార్డ్స్‌ సర్కిల్‌ బయట నలుగురు ఫీల్డర్లకు మాత్రమే అనుమతి) అమల్లో ఉన్నా ఎంతో పరిణితితో బౌలింగ్‌ చేశాడని ముకేశ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

ప్రస్తుత సీజన్‌లోనే ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన 29 ఏళ్ల ముకేశ్‌ (బిహార్‌) ఎంతో అనుభవం ఉన్న బౌలర్‌లా ఆఖరి ఓవర్‌లో పరిస్థితులను హ్యాండిల్‌ చేశాడని, ఐపీఎల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అక్షర్‌ పటేలే అయినా తమ హీరో మాత్రం ముకేశేనని ఢిల్లీ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం సైతం ముకేశే తమను గెలిపించాడని, ఒత్తిడిలో అతడు పరిస్థితులను హ్యాండిల్‌ చేసిన తీరు అమోఘమని ప్రశంసల వర్షం కురిపించింది. ఈ సీజన్‌లో లక్నోతో జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన ముకేశ్.. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు పడగొట్టాడు. 

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ.. వార్నర్‌ (21), మిచెల్‌ మార్ష్‌ (25), మనీశ్‌పాండే (34), అక్షర్‌ పటేల్‌ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ 3, భువనేశ్వర్‌ 2, నటరాజన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. కష్టసాధ్యంకాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌.. ఇషాంత్‌ శర్మ (1/18), నోర్జే (2/33), ముకేశ్‌ (0/27), అక్షర్‌ (2/21), కుల్దీప్‌ (1/22) ధాటికి చతికిలపడింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది.మయాంక్‌ అగర్వాల్‌ (49) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.  
 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)