Breaking News

శ్రీశాంత్‌పై మూడేళ్ల నిషేధం

Published on Sat, 05/03/2025 - 03:15

తిరువనంతపురం: భారత మాజీ పేస్‌ బౌలర్‌ ఎస్‌.శ్రీశాంత్‌పై కేరళ క్రికెట్‌ సంఘం (కేసీఏ) తీవ్ర చర్యలు తీసుకుంది. క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు అతనిపై మూడేళ్ల నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. కేరళ ఆటగాడు సంజు సామ్సన్‌ చాంపియన్స్‌ ట్రోఫీ కోసం భారత జట్టులోకి ఎంపిక కాకపోవడంతో శ్రీశాంత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 

ఒక మళయాళ టీవీ చానల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ... సామ్సన్‌ను విజయ్‌ హజారే వన్డే టోర్నీకి కేరళ క్రికెట్‌ సంఘం ఎంపిక చేయకపోవడం తప్పుడు నిర్ణయమని శ్రీశాంత్‌ వ్యాఖ్యానించాడు. దీని వల్లే అతను చాంపియన్స్‌ ట్రోఫీ అవకాశాలు కోల్పోయాడని అభిప్రాయపడ్డాడు. 

ఈ క్రమంలో కేరళ సంఘంపై పలు ఆరోపణలు చేసిన అతను... సామ్సన్‌తో పాటు ఇతర కేరళ క్రికెటర్లకు తాను అండగా ఉంటానని, కేరళ సంఘం నుంచి వారిని రక్షిస్తానని అతను పేర్కొన్నాడు. ఇదే కారణంగా శ్రీశాంత్‌పై వేటు పడింది. ఈ వివాదం మొదలైన సమయంలో శ్రీశాంత్‌తో పాటు కేరళ క్రికెట్‌ లీగ్‌లో అతను సహ యజమానిగా ఉన్న కొల్లామ్‌ ఏరీస్‌ టీమ్‌కు కూడా కేసీఏ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.   

‘నేను తప్పు చేయలేదు’ 
కేసీఏ తనపై నిషేధం విధించడంపై స్పందిస్తూ తాను ఎలాంటి తప్పూ చేయలేదని స్పష్టం చేశాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే అసలు నేను ఏం తప్పు చేశానో అర్థం కావడం లేదు. సామ్సన్‌ మనవాడు. అందుకే ఒక మంచి ఉద్దేశంతో అతడికి మద్దతు పలికానంతే. కేసీఏను ఎక్కడా విమర్శించలేదు. అసోసియేషన్‌లో ఉన్నవారు కాస్త పెద్ద స్థాయిలో క్రికెట్‌ ఆడిన వారైతే బాగుండేది అని మాత్రమే అన్నాను. 

సామ్సన్‌ మాత్రమే కాదు కేరళ ఆటగాళ్లు ఎవరికైనా మనం అండగా నిలవాలి నాపై నిషేధం వెనక ఎలాంటి కారణం ఉందో నాకు అర్థం కాలేదు. కేరళ అభిమానులే దీనిని నిర్ణయించండి’ అని శ్రీశాంత్‌ చెప్పాడు. భారత్‌ తరఫున 90 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన శ్రీశాంత్‌ టి20, వన్డే వరల్డ్‌ కప్‌లు గెలిచిన జట్లలో భాగంగా ఉన్నాడు.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)