Breaking News

బెంగాల్‌ టైగర్స్‌ ‘హ్యాట్రిక్‌’

Published on Sun, 01/05/2025 - 04:16

రూర్కేలా: హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌) శ్రాచి బెంగాల్‌ టైగర్స్‌ ‘హ్యాట్రిక్‌’ విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో బెంగాల్‌ టైగర్స్‌ 4–1 తేడాతో ఢిల్లీ ఎస్జీ పైపర్స్‌ను మట్టికరిపించింది. బెంగాల్‌ టైగర్స్‌ తరఫున జుగ్‌రాజ్‌ సింగ్‌ (17వ, 38వ నిమిషాల్లో) డబుల్‌ గోల్స్‌తో సత్తాచాటగా... సుఖ్‌జీత్‌ సింగ్‌ (1వ నిమిషంలో), అభిషేక్‌ (47వ ని.లో) చెరో గోల్‌ సాధించారు. 

ఢిల్లీ పైపర్స్‌ తరఫున ఫర్లాంగ్‌ గారెత్‌ (53వ ని.లో) ఏకైక గోల్‌ చేశాడు. లీగ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన బెంగాల్‌ టైగర్స్‌ 9 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అగ్రస్థానంలో ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో గోనాసిక జట్టు 3–1 గోల్స్‌ తేడాతో హైదరాబాద్‌ తూఫాన్స్‌పై గెలుపొందింది. గోనాసిక జట్టు తరఫున సునీల్‌ విఠలాచార్య (2వ ని.లో), చార్లెట్‌ విక్టర్‌ (33వ ని.లో), నీలమ్‌ సంజీప్‌ (60వ ని.లో) తలా ఒక గోల్‌ సాధించగా... హైదరాబాద్‌ తూఫాన్స్‌ తరఫున డానియల్‌ టిమోతీ (12వ ని.లో) ఏకైక గోల్‌ చేశాడు. 

మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం 2 పరాజయాలు మూటగట్టుకున్న గోనాసిక జట్టు 4 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉండగా... హైదరాబాద్‌ తూఫాన్స్‌ 3 మ్యాచ్‌ల్లో ఒక విజయం రెండు పరాజయాలతో 2 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఆదివారం జరగనున్న మ్యాచ్‌ల్లో వేదాంత కళింగ లాన్సర్స్‌తో సూర్మా హాకీ క్లబ్, తమిళనాడు డ్రాగన్స్‌తో యూపీ రుద్రాస్‌ తలపడుతుంది.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)