Breaking News

WC 2023: అదొక్కటే ఉంటే సరిపోదు.. కాస్త ఆటపై దృష్టి పెట్టు ఉమ్రాన్‌! అప్పుడే..

Published on Fri, 07/28/2023 - 21:33

Ex-India Pacer Reminder For Umran Malik: ‘‘అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించాలంటే వేగం ఒక్కటే ఉంటే సరిపోదు. ఎవరికైనా గేమ్ ప్లాన్‌ ముఖ్యం. ఈ విషయంలో అతడు ఇంకా వెనుబడే ఉన్నాడు. అంతేకాదు తన బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. అయినా, ప్రపంచకప్‌ రేసులో తన పేరు వినిపించడానికి కారణం అతడి బౌలింగ్‌లో ఉన్న వైవిధ్యమైన పేస్‌ ఒక్కటే.

కాబట్టి అతడికి వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించాలి. అంతేగానీ ఒక మ్యాచ్‌ ఆడించి మరో మ్యాచ్‌లో పక్కన పెట్టడం చేయకూడదు. ఒకవేళ ఉమ్రాన్‌ నుంచి గనుక సుదీర్ఘకాలం పాటు కీలక పేసర్‌గా సేవలు అందించాలని కోరుకుంటే.. తప్పకుండా అందుకు అనుగుణంగా అతడు తన నైపుణ్యాలకు పదునుపెట్టేలా శిక్షణ ఇవ్వాలి. 

అదే బలం.. కానీ
నిజానికి వరల్డ్‌కప్‌ ఆరంభానికి ముందు టీమిండియా ఎక్కువే మ్యాచ్‌లే ఆడబోతోంది. కాబట్టి ఆసియా వన్డే కప్‌-2023లో 5-6, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భాగంగా ఉమ్రాన్‌ను మరికొన్ని మ్యాచ్‌లు ఆడించే అవకాశం ఉంటుంది. అతడికి ఉన్న బలం పేస్‌. కానీ బౌలింగ్‌లో అంతగా పసలేదు. కాబట్టి ఉమ్రాన్‌ తన స్కిల్స్‌ మెరుగుపరచుకునే అంశంపై దృష్టి సారించాలి. జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలంటే అదొక్కటే మార్గం’’ అని టీమిండియా మాజీ పేసర్‌ ఆర్పీ సింగ్‌ అన్నాడు. 

నెట్‌బౌలర్‌గా వచ్చి.. ఏకంగా
భారత యువ ఫాస్ట్‌బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ను ఉద్దేశించి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో నెట్‌బౌలర్‌గా ప్రవేశించిన ఈ కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌.. అనతికాలంలోనే జట్టు కీలక బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. అసాధారణ వేగంతో మాజీ క్రికెటర్ల ప్రశంసలు అందుకున్నాడు.

టీమిండియా తరఫున..
ఇక గతేడాది ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శనతో టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్న అతడు జూన్‌, 2022లో ఐర్లాండ్‌ పర్యటన సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అదే ఏడాది వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు భారత్‌ తరఫున 9 వన్డేలు, 8  టీ20లు ఆడిన అతడు ఆయా ఫార్మాట్లలో 13, 11 వికెట్లు తీశాడు.

విండీస్‌ పర్యటనలో..
ప్రస్తుతం వెస్టిండీస్‌ పర్యటనలో బిజీగా ఉన్న ఉమ్రాన్‌ మాలిక్‌.. బార్బడోస్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో 3 ఓవర్ల బౌలింగ్‌లో 17 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ఇదిలా ఉంటే.. అక్టోబరు 5 నుంచి భారత్‌ వేదికగా ప్రపంచకప్‌-2023 ఆరంభం కానున్న నేపథ్యంలో ఉమ్రాన్‌ అవకాశాల గురించి ఆర్పీ సింగ్‌ కామెంట్‌ చేశాడు. రేసులో ఉండాలంటే ఈ యువ పేసర్‌ ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించాడు.

చదవండి: గుడ్‌న్యూస్‌ చెప్పిన ధోని భార్య సాక్షి! సంతోషంలో ఫ్యాన్స్‌.. ఇక.. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)