Breaking News

మయాంక్‌ అగర్వాల్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌.. ఫైనల్లో సౌత్‌జోన్‌

Published on Sun, 07/09/2023 - 07:40

బెంగళూరు: దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్‌జోన్‌ విజయలక్ష్యం 215 పరుగులు...మూడో రోజు 21 పరుగులు చేయగా, చివరి రోజు శనివారం చేతిలో 10 వికెట్లతో మరో 194 పరుగులు సాధించాలి. అయితే రెండు సార్లు మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. చివర్లో కూడా వర్షసూచన కనిపించింది. మ్యాచ్‌ ‘డ్రా’ అయితే తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగుల ఆధిక్యం సాధించిన నార్త్‌జోన్‌ ముందంజ వేసేది. కానీ సౌత్‌ ఆ అవకాశం ఇవ్వలేదు. చివరి రోజు ఓవర్‌కు 6.05 పరుగుల రన్‌రేట్‌తో దూకుడుగా ఆడి ఆటను ముగించింది.

చివరి రోజు సౌత్‌ 36.1 ఓవర్లలో 8 వికెట్లకు 219 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మయాంక్‌ అగర్వాల్‌ (57 బంతుల్లో 54; 7 ఫోర్లు), కెపె్టన్‌ హనుమ విహారి (42 బంతుల్లో 43; 8 ఫోర్లు), రికీ భుయ్‌ (29 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్‌), తిలక్‌ వర్మ (19 బంతుల్లో 25; 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మయాంక్, విహారి మూడో వికెట్‌కు 47 బంతుల్లోనే 59 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. విహారి వెనుదిరిగే సమయానికి సౌత్‌ మరో 74 పరుగులు చేయాలి.

ఈ దశలో భుయ్, తిలక్‌ 33 బంతుల్లోనే 50 పరుగులు జోడించి మళ్లీ గెలుపు బాట వేశారు. సౌత్‌ విజయానికి చేరువవుతున్న దశలో నార్త్‌ కెపె్టన్‌ జయంత్‌ యాదవ్‌ బంతి బంతికీ ఫీల్డింగ్‌ను మారుస్తూ సమయం వృథా చేసేందుకు ప్రయత్నించాడు. వెలుతురులేమి, వర్షం కారణంగా ఆట నిలిచిపోవాలని అతను ఆశించాడు. అయితే చివరకు జయంత్‌ బౌలింగ్‌లోనే భారీ సిక్స్‌తో సాయికిషోర్‌ (15 నాటౌట్‌) మ్యాచ్‌ ముగించాడు.  

ఫైనల్లో వెస్ట్‌జోన్‌... 
సెంట్రల్‌ జోన్, వెస్ట్‌జోన్‌ మధ్య జరిగిన మరో సెమీస్‌ ‘డ్రా’గా ముగిసింది. దాంతో తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగుల ఆధిక్యం సాధించిన వెస్ట్‌జోన్‌ ఫైనల్‌ చేరింది. 390 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్రల్‌ 4 వికెట్లకు 128 పరుగులే చేసింది. రింకూ సింగ్‌ (30 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)