Breaking News

వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం.. సిరీస్‌ సొంతం

Published on Sun, 08/18/2024 - 07:32

గయానా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 40 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-1 తేడాతో సౌతాఫ్రికా కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటిం‍గ్ చేసిన సఫారీలు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 160 పరుగులకే కుప్పకూలింది.

విండీస్ బౌలర్లలో యువ పేసర్ షమీర్ జోషఫ్ 5 వికెట్లతో చెలరేగగా.. సీల్స్ మూడు,హోల్డర్‌, మోటీ తలా వికెట్ సాధించారు. ప్రోటీస్ బ్యాటర్లలో డేన్ పీడ్ట్(38) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అనంత‌రం వెస్టిండీస్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయింది.

ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల దాటికి 144 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. 16 ప‌రుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను మొద‌లుపెట్టిన ప్రోటీస్ 246 ప‌రుగుల‌కు ఆలౌటైంది. సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌లో వెర్రెయిన్నే(59), మార్‌క్ర‌మ్‌(51) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు.

వెస్టిండీస్ బౌల‌ర్ల‌లో జైడ‌న్ సీల్స్ 6 వికెట్ల‌తో స‌త్తాచాటాడు. ఇక‌ తొలి ఇన్నింగ్స్‌లో ల‌భించిన ఆధిక్యాన్ని క‌లుపున‌కుని  విండీస్ ముందు  263 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ద‌క్షిణాఫ్రికా ఉంచింది. ల‌క్ష్య చేధ‌న‌లో క‌రేబియ‌న్ జ‌ట్టు 222 ప‌రుగులకు ఆలౌటైంది. కేశ‌వ్ మ‌హారాజ్‌, ర‌బాడ త‌లా మూడు వికెట్ల‌తో ఆతిథ్య జ‌ట్టును దెబ్బ‌కొట్టాడు. ఇక ఇరు జ‌ట్ల మ‌ధ్య టీ20 సిరీస్ ఆగ‌స్టు 23 నుంచి ప్రారంభం కానుంది.

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)