Breaking News

గెలుపు జోష్‌లో ఉన్న సౌతాఫ్రికాకు వరుస షాక్‌లు

Published on Thu, 09/11/2025 - 12:25

ఇంగ్లండ్‌ పర్యటనలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సౌతాఫ్రికాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఈ పర్యటనలో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న ఆ జట్టు.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ ఘనంగా బోణీ కొట్టింది. నిన్న జరిగిన తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆతిథ్య ఇంగ్లండ్‌పై 14 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి) గెలుపొంది, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో వెళ్లింది.

ఈ మ్యాచ్‌కు ముందే సౌతాఫ్రికాకు రెండు భారీ షాక్‌లు తగిలాయి. స్టార్‌ పేసర్‌ లుంగి ఎంగిడి, స్టార్‌ స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌ గాయాల బారిన పడ్డారు. వీరిలో ఎంగిడి ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ మొత్తానికి దూరంగా కాగా.. కేశవ్‌ మహారాజ్‌ ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌తో పాటు ఆతర్వాత పాకిస్తాన్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌కు కూడా దూరం కావచ్చు. 

ఇంగ్లండ్‌ సిరీస్‌లో ఎంగిడికి ప్రత్యామ్నాయంగా నండ్రే బర్గర్‌ను ఎంపిక చేయగా.. మహారాజ్‌కు ప్రత్యామ్నాయాన్ని ఇంకా ప్రకటించలేదు. మహారాజ్‌ గాయంపై ఇంకా పూర్తి క్లారిటీ లేకపోవడంతో క్రికెట్‌ సౌతాఫ్రికా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మెడికల్‌ రిపోర్ట్‌లు వచ్చిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

మహారాజ్‌ ఇటీవలికాలంలో సౌతాఫ్రికా విజయాల్లో అత్యంత​ కీలకపాత్ర పోషిస్తున్నాడు. గత వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌తో మొదలు.. తాజాగా ఇంగ్లండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌ వరకు అతని హవా కొనసాగింది. సౌతాఫ్రికా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో కొత్త డబ్ల్యూటీసీ సైకిల్‌ను ప్రారంభించే తరుణంలో (పాక్‌తో సిరీస్‌) మహారాజ్‌ గాయపడటం​ ఆ జట్టు విజయావకాశాలను తప్పక ప్రభావితం చేయవచ్చు. 

సౌతాఫ్రికా 2 టెస్ట్‌లు, 3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌ల కోసం అక్టోబర్‌ 12 నుంచి పాకిస్తాన్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనకు మహారాజ్‌ పూర్తిగా దూరమవుతాడా లేక టెస్ట్‌లకు మాత్రమే అందుబాటులో ఉండడా అన్న విషయంపై త్వరలోనే క్లారిటీ వస్తుంది.

మహారాజ్‌ తాజాగా ఇంగ్లండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో అతను 3 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీశాడు. మహారాజ్‌ తొలి టీ20 ఆడకపోయినా సౌతాఫ్రికా ఆ మ్యాచ్‌లో గెలుపొందింది.  

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?