Breaking News

మాకు ముందే తెలుసు.. వారిద్దరూ అద్బుతం! సెమీస్‌లో కూడా: దక్షిణాఫ్రికా కెప్టెన్‌

Published on Sun, 11/05/2023 - 22:36

వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా దారుణ ఓటమి చవిచూసింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 243 పరుగుల తేడాతో ప్రోటీస్‌ పరాజయం పాలైంది. అంతర్జాతీయ వన్డేల్లో పరుగుల పరంగా సఫారీలకు ఇదే అతి పెద్ద ఓటమి.

327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా భారత బౌలర్ల దాటికి 83 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లతో చెలరేగగా.. షమీ, కుల్దీప్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు.  ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్‌ అనంతరం దక్షిణాఫ్రికా టెంబా బావుమా స్పందించాడు. బ్యాటింగ్‌ వైఫల్యం కారణంగానే ఓటమి చెందామని బావుమా తెలిపాడు.

"టీమిండియాతో పోటీ మాకు ఒక పెద్ద సవాలు అని తెలుసు. బ్యాటింగ్‌లో మేము దారుణంగా విఫలమయ్యాం. మరోసారి ఛేజింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాం. ఛేజింగ్‌ ప్రారంభించే ముందు మా బ్యాటర్లతో కొన్ని విషయాలను చర్చించాను.

కానీ మా ప్రణాళికలను అమలు చేయడంలో ఫెయిల్‌ అయ్యాం. తొలుత పవర్‌ ప్లేలో భారత్‌ దూకుడుగా ఆడింది. మొదటి 10 ఓవర్లలో 90 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత మా బౌలర్లు అద్భుతమైన కమ్‌బ్యాక్‌ ఇచ్చారు.  టీమిండియా రన్‌రేట్‌ను తగ్గించారు. రోహిత్‌ శర్మ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు.

ఆతర్వాత కోహ్లీ, అయ్యర్‌ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే వికెట్‌ బ్యాటింగ్‌కు బాగానే అనుకూలించింది. కానీ దురదృష్టవశాత్తూ మేము బ్యాటింగ్‌ మెరుగ్గా చేయలేకపోయాం. సెమీస్‌లో కూడా ఇదే వేదికపై మేము ఆడే అవకాశముంది. అందుకు తగ్గ ప్రణాళికలను మేము సిద్దం చేసుకుంటామని" పోస్ట్‌మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో బావుమా పేర్కొన్నాడు.
చదవండి: మాకు ఎటువంటి స్పెషల్‌ ప్లాన్స్‌ లేవు.. అతడొక ఛాంపియన్‌! జడ్డూ కూడా: రోహిత్‌ శర్మ

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)