Breaking News

'అత‌డి రీ ఎంట్రీ తప్పనిసరి.. మూడు ఫార్మాట్ల‌లోనూ ఆడించాలి'

Published on Tue, 11/11/2025 - 09:07

భార‌త‌ స్టార్ పేసర్ మహ్మద్ షమీ జాతీయ జట్టుకు దాదాపు ఎనిమిది నెల‌ల‌గా దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. షమీ దేశ‌వాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న‌ప్ప‌టికీ అజిత్ అగార్క‌ర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మాత్రం మొండి చేయి చూపిస్తోంది.

ఈ బెంగాల్ స్పీడ్ స్టార్ చివ‌ర‌సారిగా  ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో భార‌త్ తరపున ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ సిరీస్‌తో పాటు ఆసియాకప్‌, వెస్టిండీస్‌తో టెస్టులకు షమీని సెలక్టర్లు పక్కన పెట్టారు. కనీసం స్వదేశంలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కైనా షమీని ఎంపిక చేస్తారని భావించారు. 

కానీ మరోసారి అగార్కర్ అండ్ కో షమీకి మొండి చేయి చూపించారు. తను ఫిట్‌గా ఉన్నప్పటికి కావాలనే ఎంపిక చేయడం లేదని చీఫ్ సెలక్టర్ అగార్కర్‌ను షమీ పరోక్షంగా విమర్శించాడు. ఈ నేపథ్యంలో షమీకి భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచాడు. షమీ భారత జట్టు తరపున తిరిగి అన్ని ఫార్మాట్లలో ఆడాలని తన ఆశిస్తున్నట్లు దాదా తెలిపాడు.

"మహ్మద్ షమీ చాలా ఫిట్‌గా ఉన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. మూడు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో బెంగాల్‌ను అతడు ఒంటి చేత్తో గెలిపించాడు. అతడి ప్రదర్శలను సెలక్టర్లు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పటికే షమీతో సెలక్టర్లు మాట్లాడి ఉంటారు.

ఫిట్‌నెస్ గానీ, స్కిల్ విషయంలో గానీ షమీ ఇప్పటికీ అదే స్థాయిలో ఉన్నాడు. కాబట్టి అతడిని టెస్ట్‌లు, వన్డేలు, టీ20లు అన్నింటిలోనూ భారత్ తరపున కొనసాగించాలి" అని ఓ కార్యక్రమంలో గంగూలీ పేర్కొన్నాడు. కాగా ప్రస్తుత రంజీ సీజన్‌లో షమీ 91 ఓవర్లు బౌలింగ్ చేసి 15 వికెట్లు సాధించాడు.  కాగా భారత్‌-సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోల్‌కతా వేదికగా నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)