Breaking News

మరో కొత్త అవతారంలో గంగూలీ

Published on Sun, 03/08/2026 - 09:08

టీమిండియా ఆటగాడిగా, కెప్టెన్‌గా, బీసీసీఐ, బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా, కోచ్‌గా, మెంటార్‌గా వివిధ హోదాల్లో క్రికెట్‌కు సేవలందించిన భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ.. త్వరలో క్రికెటేతర రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు.  ప్రముఖ టీవీ రియాలిటీ షో 'బిగ్‌ బాస్‌' బెంగాలీ వెర్షన్‌కు హోస్ట్‌గా ఎంపికయ్యాడు. ఈ షోను ఇటీవలే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఘనంగా ప్రకటించారు.  

బిగ్‌ బాస్‌ లాంచ్‌ వేడుక  ఈడెన్ గార్డెన్స్‌లో భారీ లైట్ షో, కళాకారుల ప్రదర్శనలు, సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్‌తో ఘనంగా జరిగింది. ఈ షో స్టార్ జల్షా ఛానల్‌లో ప్రసారం కానుంది. బిగ్‌ బాస్‌ హోస్ట్‌గా ఎంపికైన సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. ఏ పని చిన్నది కాదు. దేశం కోసం ఆడినా, షో హోస్ట్ చేసినా, నేను పూర్తి అంకితభావంతో చేస్తాను అని అన్నాడు.  

కాగా, గంగూలీ ప్రస్తుతం ఐసీసీ మెన్స్‌ క్రికెట్‌ కమిటీ ఛైర్‌ పర్సన్‌గా, బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌గా, బీసీసీఐ క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ అడ్మినిస్ట్రేటర్‌గా వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇవి కాకుండా ఇప్పుడు అదనంగా బిగ్‌ బాస్‌ హోస్ట్‌ బాధ్యతలు చేపట్టాడు.

మరోవైపు గంగూలీ బయోపిక్ తెరపైకి రానున్న విషయం తెలిసిందే. అందులో రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించనున్నారు. అపరాజిత ఆధ్యా గంగూలీ తల్లి పాత్రలో, బోమన్ ఇరానీ తండ్రి చండీ గంగూలీగా నటించనున్నట్లు సమాచారం. పాత్రకు సన్నద్ధం కావడానికి రాజ్‌కుమార్ రావు గంగూలీ ఇంట్లో కొంతకాలం గడపనున్నారు.  

 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)