Breaking News

అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన సౌరవ్‌ గంగూలీ

Published on Mon, 09/15/2025 - 15:21

భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్‌ సౌరవ్ గంగూలీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యారు. 2015–2019 మధ్యకాలంలో తొలిసారి ఈ పదవిని నిర్వహించిన ఆయన.. ఇప్పుడు రెండోసారి క్యాబ్‌ బాస్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. 

తన అన్న స్నేహాశిష్ గంగూలీ స్థానాన్ని సౌరవ్‌ భర్తీ చేయనున్నారు. గంగూలీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ పదవి కొసం ఇతరులెవ్వరూ నామినేషన్లు వెయ్యలేదు. ఇతరులెవ్వరైనా నామినేషన్లు వేసి ఉంటే అధ్యక్ష ఎన్నిక సెప్టెంబర్‌ 22న జరిగేది.

గంగూలీ ప్యానెల్‌లో నితీష్ రంజన్ దత్తా ఉపాధ్యక్షుడిగా, బబ్లు కోలే కార్యదర్శిగా, మదన్‌మోహన్‌ ఘోష్‌ సహాయ కార్యదర్శిగా, సంజయ్‌ దాస్‌ ట్రెజరర్‌గా ఉంటారు.

రెండో సారి క్యాబ్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత గంగూలీ మాట్లాడుతూ ఇలా అన్నాడు. చాలా ఆనందంగా ఉంది. మరోసారి క్యాబ్‌ కుటుంబంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. క్యాబ్‌ ఓ కుటుంబం లాంటిది. ఇక్కడ ఎలాంటి ప్రతిబంధకాలు లేవు. 

త్వరలో ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగబోయే  ఇండియా-సౌతాఫ్రికా టెస్ట్‌ మ్యాచ్‌పై దృష్టి పెడతాను. అలాగే టీ20 వరల్డ్‌కప్‌, బెంగాల్‌ ప్రో టీ20 లీగ్‌ను విజయవంతం చేసేందుకు కృషి చేస్తాను. మిగతా సభ్యుల సహకారంతో బెంగాల్ క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్తాను.

ఇదిలా ఉంటే, గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా మరోసారి ఎన్నికవుతారని టాక్‌ నడుస్తుంది. క్యాబ్‌ గంగూలీని తమ ప్రతినిధిగా ఏజీఎంకు నామినేట్‌ చేయడంతో ఈ ప్రచారం మొదలైంది. ఏజీఎంకు నామినేట్‌ కావడం వల్ల గంగూలీ బీసీసీఐ అధ్యక్ష రేసులో ఉంటాడు. 

గంగూలీ 2019-2022 మధ్యలో బీసీసీఐ బాస్‌గా వ్యవహరించాడు. తాజా మాజీ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ దిగిపోవడంతో సెప్టెంబర్‌ 28న ఎన్నిక జరుగనుంది. ఈ పదవికి సెప్టెంబర్‌ 20, 21 తేదీల్లో నామినేషన్లు వేస్తారు. 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు