Breaking News

మరోసారి అధ్యక్ష పదవి కోసం పోటీపడనున్న గంగూలీ

Published on Wed, 08/06/2025 - 13:17

టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ బాస్‌ సౌరవ్‌ గంగూలీ మరోసారి బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (CAB) అధ్యక్ష పదవి కోసం పోటీ పడనున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా మీడియాకు వెల్లడించాడు. గంగూలీ 2015–2019 మధ్యలో క్యాబ్‌ అధ్యక్షుడిగా పని చేశాడు. 

ఆతర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. బీసీసీఐ బాస్‌ హోదాలో గంగూలీ మూడేళ్లు (2019-2022) ఉన్నాడు. తన హయాంలో గంగూలీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు.

ప్రస్తుతం క్యాబ్‌ అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ అన్న స్నేహశిష్‌ గంగూలీ ఉన్నాడు. అతని పదవీకాలం త్వరలోనే ముగియనుంది. స్నేహశిష్‌కు క్యాబ్‌ అధ్యక్షుడిగా కొనసాగాలని ఉన్నా, లోథా కమిటీ సిఫార్సుల ప్రకారం​ అది సాధ్యపడదు. దీంతో సౌరవ్‌ గంగూలీ బరిలోకి దిగుతున్నాడు.

సౌరవ్‌ గంగూలీకి క్యాబ్‌లో మంచి పట్టు ఉండటంతో అతని ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. గంగూలీ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 25న క్యాబ్‌ వార్షిక సమావేశం జరగనుంది. అంతకుముందే అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. 

ప్రస్తుతం సౌరవ్‌ గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు (ఐపీఎల్‌) డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా పని చేస్తున్నాడు. ఒకవేళ క్యాబ్‌ అధ్యక్షుడిగా ఎన్నికైతే ఈ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)