Breaking News

వరల్డ్‌కప్‌ తర్వాత వన్డేలకు గుడ్‌బై చెప్పనున్న దిగ్గజ క్రికెటర్‌

Published on Tue, 06/17/2025 - 13:37

న్యూజిలాండ్‌ క్రికెట్‌ దిగ్గజం, ఆ దేశ మహిళా క్రికెట్‌ జట్టు పరిమిత ఓవర్ల సారధి సోఫీ డివైన్‌ త్వరలో వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించనుంది. ఈ ఏడాది భారత్‌, శ్రీలంకల్లో జరిగే ప్రపంచకప్‌ తర్వాత డివైన్‌ 50 ఓవర్ల ఫార్మాట్‌కు దూరం కానుంది. ఈ విషయాన్ని న్యూజిలాండ్‌ క్రికెట్‌ అధికారికంగా ధృవీకరించింది.

పేస్‌ బౌలర్‌గా కెరీర్‌ ప్రారంభించిన 35 ఏళ్ల డివైన్‌.. క్రమంగా బ్యాటర్‌గా పరిణితి చెంది న్యూజిలాండ్‌ తరఫున 2006 నుంచి 152 వన్డేలు ఆడింది. కెరీర్‌ తొలి నాళ్లలో డివైన్‌ 11వ నంబర్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగేది. బ్యాటర్‌గా రాటుదేలాక డివైన్‌ 139 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 8 సెంచరీలు, 16 హాఫ్‌ సెంచరీలు సాయంతో 3990 పరుగులు చేసింది.

ఈ ఫార్మాట్‌లో ఆమె 107 వికెట్లు కూడా తీసింది. సూజీ బేట్స్‌ తర్వాత న్యూజిలాండ్‌ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన మహిళా క్రికెటర్‌గా డివైన్‌ రికార్డు నెలకొల్పింది. 

అలాగే న్యూజిలాండ్‌ తరఫున సూజీ బేట్స్‌ తర్వాత రెండో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా.. న్యూజిలాండ్‌ తరఫున నాలుగో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా.. లియా తహుహు తర్వాత న్యూజిలాండ్‌ తరఫున రెండో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పలు రికార్డులు సొంతం చేసుకుంది.

2020లో న్యూజిలాండ్‌ పెర్మనెంట్‌ కెప్టెన్‌గా ఎంపికైన డివైన్‌.. 2024లో తన సారథ్యంలో న్యూజిలాండ్‌ను టీ20 వరల్డ్‌కప్‌ గెలిపించింది. అయితే వన్డేల్లో మాత్రం డివైన్‌ న్యూజిలాండ్‌ను గత రెండు వన్డే వరల్డ్‌కప్‌ల్లో గ్రూప్‌ దశ దాటించలేకపోయింది. 

డివైన్‌ సారథ్యంలో న్యూజిలాండ్‌ సెప్టెంబర్‌ 30 నుంచి ప్రారంభం కాబోయే ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్‌ అక్టోబర్‌ 1న తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఇండోర్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియను ఢీకొంటుంది. అక్టోబర్‌ 23న న్యూజిలాండ్‌ టీమిండియాతో తలపడుతుంది. గౌహతిలో ఈ మ్యాచ్‌ జరుగనుంది.

డివైన్‌ న్యూజిలాండ్‌ మహిళా క్రికెటర్‌గానే కాకుండా ఆ దేశ జాతీయ హాకీ టీమ్‌లోనూ సభ్యురాలిగా ఉండింది. కొంతకాలం తర్వాత ఆమె క్రికెట్‌నే ఫుల్‌టైమ్‌ కెరీర్‌గా ఎంచుకుంది. డివైన్‌ తన కెరీర్‌ మొత్తంలో బ్యాటింగ్‌ చేసే సమయంలో హెల్మెట్‌ లేకుండా బరిలోకి దిగేది. దీని వల్ల ఆమెకు విశేష ప్రచారం లభించింది. 

వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించినా డివైన్‌ తన టీ20 కెరీర్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. డివైన్‌ న్యూజిలాండ్‌ తరఫున 146 టీ20లు ఆడి సెంచరీ, 21 హాఫ్‌ సెంచరీల సాయంతో 3431 పరుగులు చేసింది. బౌలింగ్‌లో 119 వికెట్లు పడగొట్టింది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)