Breaking News

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ సిద్ధం

Published on Thu, 07/30/2026 - 22:02

హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (కేఐవైజీ) నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో, రాష్ట్ర క్రీడాకారులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ   రాష్ట్ర క్రీడా సంఘాలతో వ్యూహాత్మక సమావేశాల శ్రేణిని ప్రారంభించింది. 

స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్‌పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్ డా. ఎ. సోనిబాలా దేవి, ఐఎఫ్‌ఎస్ అధ్యక్షతన జరిగిన తొలి సమావేశంలో అథ్లెటిక్స్, సైక్లింగ్, ఆర్చరీ, జిమ్నాస్టిక్స్, బ్యాడ్మింటన్, మల్లఖంబ్, గట్కా, కలరిపయట్టు తదితర రాష్ట్ర క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి పతకాల సాధనకు అవకాశమున్న ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి శాస్త్రీయ విధానంలో శిక్షణ అందించే కార్యాచరణపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా ఎంపిక ప్రక్రియను మూడు దశల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా సెలెక్షన్ ట్రయల్స్, అనంతరం ఫస్ట్ లెవల్ క్యాంప్, చివరగా కోర్ క్యాంప్ నిర్వహించేలా ప్రణాళికను రూపొందించారు. ప్రతి దశకు సంబంధించిన కాలవ్యవధి, శిక్షణా ప్రణాళిక, అవసరమైన మౌలిక వసతులు, క్రీడా సామగ్రి, కోచ్‌ల నియామకం తదితర అంశాలను సమీక్షించారు.

ఈ సందర్భంగా డా. ఎ. సోనిబాలా దేవి మాట్లాడుతూ, ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో స్వరాష్ట్రంలోనే తెలంగాణ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచేలా ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను గుర్తించి, వారికి వ్యవస్థీకృత శిక్షణ అందించేందుకు ఎస్‌ఏటీజీ కట్టుబడి ఉందన్నారు.రాష్ట్రానికి పతకాల అవకాశాలు అధికంగా ఉన్న క్రీడలను గుర్తించి, వాటికి అనుగుణంగా ప్రత్యేక శిక్షణా శిబిరాలు, కోచింగ్, అవసరమైన సహాయ సహకారాన్ని అందించే దిశగా క్రీడల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. 

ఈ ప్రక్రియలో భాగంగా మిగిలిన రాష్ట్ర క్రీడా సంఘాలతోనూ దశలవారీగా సమావేశాలు నిర్వహించి సన్నాహాలను మరింత వేగవంతం చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్లు రవీందర్, శ్రీనివాస్, అశోక్, పి ఆర్ ఓ సురేష్ కాలేరు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి మల్లారెడ్డి, ప్రతినిధి ప్రవీణ్‌తో పాటు వివిధ రాష్ట్ర క్రీడా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)