IPL 2024: హార్దిక్‌ పాండ్యాపై అనుమానం

Published on Sat, 04/13/2024 - 13:00

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా గురించి న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ సైమన్‌ డౌల్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాండ్యా ఏదో ఇబ్బందితో బాధ పడుతున్నాడని.. అయినా ఆ విషయాన్ని మాత్రం బయటపెట్టడం లేదని అభిప్రాయపడ్డాడు.

కావాలనే తన సమస్య గురించి అతడు దాచిపెడుతున్నట్లు కనిపిస్తోందని సైమన్‌ డౌల్‌ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్‌-2024 సందర్భంగా ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా కొత్త ప్రయాణం మొదలుపెట్టిన హార్దిక్‌ పాండ్యాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.

హేళనలు.. విమర్శల వర్షం
ఓవైపు రోహిత్‌ శర్మపై కెప్టెన్‌గా వేటుకు పాండ్యానే కారణమని ముంబై అభిమానులు అతడిని పెద్ద ఎత్తున ట్రోల్‌ చేయగా.. మరోవైపు హ్యాట్రిక్‌ పరాజయాల కారణంగా పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు వరల్డ్‌క్లాస్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను కాదని.. తొలి మ్యాచ్‌లో తానే బౌలింగ్‌ అటాక్‌ ఆరంభించడం కూడా పాండ్యాపై విమర్శలకు కారణమైంది.

అయితే, తర్వాత ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌ పంథా మార్చాడు. బౌలింగ్‌ చేయడం కంటే బ్యాటింగ్‌ చేయడంపైనే ఎక్కువ దృష్టి సారించాడు. ఈ క్రమంలో వరుసగా రెండు విజయాలు అందుకుని విమర్శకులకు సమాధానం ఇచ్చాడు. 

పాండ్యా తీరుపై అనుమానం
ఇదిలా ఉంటే.. హార్దిక్‌ పాండ్యా ఎక్కువ ఓవర్లు బౌలింగ్‌ చేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ కివీస్‌ మాజీ పేసర్‌ సైమన్‌ డౌల్‌ అనుమానం వ్యక్తం చేశాడు. ‘‘తొలి మ్యాచ్‌లో తొలి ఓవర్‌ను వేసిన బౌలర్‌.. అకస్మాత్తుగా జట్టుకు తన సేవలు అవసరం లేదన్నట్లుగా వ్యవహరించడం ఆశ్చర్యంగా ఉంది.

అతడు గాయపడ్డాడు. ఏదో సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఆ విషయాన్ని బయటపెట్టడం లేదు. కచ్చితంగా ఏదో దాచిపెడుతున్నాడని నా మనసు బలంగా చెబుతోంది’’ అని సైమన్‌ డౌల్‌ క్రిక్‌బజ్‌ షోలో వ్యాఖ్యానించాడు.

అప్పుడు చీలమండకు గాయం
కాగా గుజరాత్‌ టైటాన్స్‌తో పదిహేడో ఎడిషన్‌ ఆరంభించిన ముంబై ఇండియన్స్‌ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ అనంతరం పాండ్యా మాట్లాడుతూ.. సరైన సమయంలో మళ్లీ పూర్తి స్థాయిలో బంతితో బరిలోకి దిగుతానని చెప్పిన విషయం తెలిసిందే.

ముంబై జట్టులో కావాల్సినంత మంది పేసర్లు ఉన్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అయితే, సైమన్‌ డౌల్‌ మాత్రం అతడి వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదు. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్‌-2023 సందర్భంగా పాండ్యా చీలమండకు గాయం కాగా.. కోలుకున్న అనంతరం ఐపీఎల్‌-2024 ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు.

చదవండి: గైక్వాడ్‌ ఈ ఒక్క ఏడాదే.. వచ్చే సీజన్‌లో CSK కెప్టెన్‌ అతడే!

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)