Breaking News

స్మీడ్‌ ఊచకోత.. టీ20 బ్లాస్ట్‌ 2025 విజేతగా సోమర్‌సెట్‌.. రికార్డు ఛేదన

Published on Sun, 09/14/2025 - 07:21

టీ20 బ్లాస్ట్‌ 2025 విజేతగా సోమర్‌సెట్‌ ఆవిర్భవించింది. నిన్న (సెప్టెంబర్‌ 13) జరిగిన ఫైనల్లో హ్యాంప్‌షైర్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హ్యాంప్‌షైర్‌.. టాబీ ఆల్బర్ట్‌, కెప్టెన్‌ జేమ్స్‌ విన్స్‌ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.

టీ20 బ్లాస్ట్‌ ఫైనల్స్‌ చరిత్రలో ఇది రెండో భారీ స్కోర్‌. అయినా ఈ స్కోర్‌ను హ్యాంప్‌షైర్‌ కాపాడుకోలేకపోయింది. విల్‌ స్మీడ్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడి సోమర్‌సెట్‌ను గెలిపించాడు. కెప్టెన్‌ లెవిస్‌ గ్రెగరి మరో ఓవర్‌ మిగిలుండగానే సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. సోమర్‌సెట్‌కు ఇది మూడో టీ20 బ్లాస్ట్‌ టైటిల్‌.

పూర్తి వివరాల్లోకి వెళితే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన హ్యాంప్‌షైర్‌.. టాబీ ఆల్బర్ట్‌ (48 బంతుల్లో 85; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), జేమ్స్‌ విన్స్‌ (34 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో భారీ స్కోర్‌ చేసింది. ఆఖర్లో బెన్నీ హోవెల్‌ (19 బంతుల్లో 26 నాటౌట్‌; 2 సిక్సర్లు) వేగంగా పరుగులు రాబట్టాడు. 

క్రిస్‌ లిన్‌ 12, జేమ్స్‌ ఫుల్లర్‌ 1, బెన్‌ మేయర్స్‌ 9, అలీ ఒర్‌ 3 పరుగులు చేశారు. సోమర్‌సెట్‌ బౌలర్లలో జేక్‌ బాల్‌ 2, గ్రెగరి, ఓవర్టన్‌, గోల్డ్స్‌వర్తీ తలో వికెట్‌ తీశారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సోమర్‌సెట్‌.. విల్‌ స్మీడ్‌ (58 బంతుల్లో 94; 14 ఫోర్లు, 14 ఫోర్లు, సిక్స్‌) విధ్వంసం సృష్టించడంతో 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది (4 వికెట్లు కోల్పోయి). 

సీన్‌ డిక్సన్‌ (22 బంతుల్లో 33 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్రెగరి (5 బంతుల్లో 18 నాటౌట్‌; ఫోర్‌, 2 సిక్సర్లు) సోమర్‌సెట్‌ను విజయతీరాలకు చేర్చారు. మిగతా బ్యాటర్లలో టామ్‌ కొహ్లెర్‌ కాడ్‌మోర్‌ 23, టామ్‌ ఏబెల్‌ 0, జేమ్స్‌ రూ 20 పరుగులు చేశారు. 

హ్యాంప్‌షైర్‌ బౌలరల్లో స్కాట్‌ కర్రీ 2, సొన్నీ బేకర్‌, జేమ్స్‌ ఫుల్లర్‌ తలో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో స్మీడ్ చేసిన పరుగులు (94) టోర్నీ ఫైనల్స్‌ ఛేదనల చరిత్రలో అత్యధికం. ఈ మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌కు గానూ స్మీడ్‌కే ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్దు దక్కింది.

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)