Breaking News

ఇద్దరు దిగ్గజాలు కలిసిన వేళ..

Published on Sun, 11/13/2022 - 13:18

సచిన్‌ టెండూల్కర్‌, బ్రియాన్‌ లారా.. ఇద్దరు ఇద్దరే. సమకాలీన క్రికెట్‌లో పరుగులు సాధించడంలో పోటీ పడ్డారు. సచిన్‌ రెండు ఫార్మాట్లలో(వన్డే, టెస్టులు) ఎదురులేకుండా సాగితే.. లారా మాత్రం టెస్టుల్లో సచిన్‌కు ధీటుగా నిలిచాడు. అంతేకాదు ఎవరికి సాధ్యం కాని క్వాడ్రపుల్‌ సెంచరీ(400 పరుగులు)ని లారా అందుకున్నాడు. సచిన్‌ వంద సెంచరీలు, డబుల్‌ సెంచరీలు అందుకున్నప్పటికి ట్రిపుల్‌ సెంచరీ, క్వాడ్రపుల్‌ సెంచరీలు తీరని కలగానే మిగిలిపోయాయి. మరి ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకేచోట కలిస్తే చూడడానికి ఆ ఫ్రేమ్‌ ఎంతో అందంగా ఉంటుంది.

తాజాగా హిందుస్థాన్ టైమ్స్ నిర్వహించిన లీడర్‌షిప్ సమ్మిట్‌కు హాజరైన వీరు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ఇద్దరు తమ గురించి అభిమానులకు కొన్ని వాస్తవాలను తెలియపరిచారు. మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారు..తమ ట్రేడ్ మార్క్, నిరాశలో కూరుకున్నప్పుడు ఎలా ఉన్నారు లాంటి విషయాలను వెల్లడించారు. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో సచిన్, లారా కలిసి బ్యాటింగ్ చేయడం గురించి కునాల్ అడిగారు. ఆ వీడియో కోసం అభిమానులు యూట్యూబ్‌లో విపరీతంగా సెర్చ్ చేశారని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్‌లతో లాంటి స్టార్లు ఉన్న పాకిస్థాన్ లైనప్‌ను ఎలా కూల్చివేశారో సచిన్, లారా వివరంగా తెలియజేశారు.

సిడ్నీలో సచిన్ ఐకానిక్ డబుల్ సెంచరీ చేసినప్పుడు తన ఆనందాన్ని ఎలా నియంత్రించుకున్నాడో లారా గుర్తు చేసుకున్నాడు. ప్రతి అభిమానివ వలే ఎంతో ఉద్వేగానికి లోనయ్యానని తెలిపాడు. అలాగే లారా పరుగుల దాహం, నిలకడం, నైపుణ్యం గురించి సచిన్ ప్రశంసించాడు. కరెబియన్ దిగ్గజం కిట్ బ్యాగ్ గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నాడు.

టి20 రాకతో క్రికెట్ చాలా మారిపోయిందని ఇద్దరు మాజీలు తెలియజేశారు.ఇప్పటి బ్యాటర్లు తమ వినూత్న 360 డిగ్రీల షాట్లతో బ్యాటింగ్‌లో విప్లవాత్మక మార్పులు చేశారని.. కొంతమంది వారిని ఎగతాళీ చేసినప్పటికీ.. వారి వైవిధ్యమైన ఆటతీరు గేమ్‌ను మంచిగా మార్చివేసిందని లారా స్పష్టం చేశాడు. మూడు ఫార్మాట్లలో ఆడటం చాలాకష్టమని.. కొంతమంది టెస్టుల్లో కష్టపడుతుంటే.. కొంతమంది మాత్రం టి20 ఫార్మాట్‌లో సవాలు ఎదుర్కొంటున్నారని తెలిపాడు.

పాకిస్థాన్‌కు మెరుగైన జట్టు ఉందని లారా అభిప్రాయపడ్డాడు. మరోవైపు సచిన్ ఎంసీజీ మైదానం ఇంగ్లాండ్‌కు కలిసొస్తుందని, అందుకని బట్లర్ జట్టు గెలిచే అవకాశముందని స్పష్టం చేశాడు. మొత్తంమీద సచిన్, లారా ఇద్దరూ మరోసారి తమ అభిమానులతో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)