Breaking News

CWG 2026: షాట్‌పుట్‌ భారత్‌కు డబుల్‌ ధమాకా.. స్వర్ణం, రజతం సొంతం

Published on Sat, 08/01/2026 - 17:19

కామన్వెల్త్ గేమ్స్‌ 2026లో భారత పారా అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల షాట్‌పుట్‌ F57 ఫైనల్లో సోమన్ రాణా స్వర్ణ పతకం సాధించగా, శుభమ్ జుయాల్ రజత పతకం దక్కించుకున్నాడు. 

సోమన్ రాణా 13.40 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలువగా.. శుభమ్ జుయాల్ 13.28 మీటర్ల త్రోతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ పతకాలతో భారత్‌ మొత్తం పతకాల సంఖ్య 30కి (8 గోల్డ్‌, 15 సిల్వర్‌, 7 బ్రాంజ్‌) చేరింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్‌ ఆరో స్థానంలో కొనసాగుతోంది.

కాగా, ఇవాళ ఒక్క రోజే భారత్‌ ఖాతాలో 3 స్వర్ణాలు (మహిళల బాక్సింగ్‌ 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్‌, మహిళల బాక్సింగ్‌ 57 కేజీల విభాగంలో జాస్మిన్ లంబోరియా, పారా పురుషుల షాట్‌పుట్‌ F57 విభాగంలో సోమన్ రాణా) చేరాయి.

ట్రిపుల్‌ జంప్‌లోనూ రెండు పతకాలు
ఇవాళే జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్ విభాగంలోనూ భారత అథ్లెట్లు మెరిశారు. ప్రవీణ్ చిత్రవేల్ (16.58 మీటర్ల ఎత్తు) ఎగిరి రజతం ఒడిసిపట్టగా, భారత్‌కే చెందిన మరో అథ్లెట్ సెల్వ ప్రభు (16.52 మీటర్ల ఎత్తు) ఎగిరి కాంస్య పతకం సాధించాడు.

రజతంతో సరిపెట్టుకున్న జడుమణి
పురుషుల 55 కేజీల విభాగంలో భారత బాక్సర్‌ జడుమణి సింగ్ రజతంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో జడుమణి ఆస్ట్రేలియాకు చెందిన జై డిక్సన్ చేతిలో ఓటమి పాలయ్యాడు.
 

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)