Shreyas Iyer: సైలెంట్ వారియ‌ర్

Published on Wed, 04/16/2025 - 14:57

స‌క్సెస్ ఈజ్ ద బెస్ట్ రెవేంజ్.. అంటారు. అవ‌మానించిన వారికి గెలుపుతో స‌మాధానం చెబితే వ‌చ్చే కిక్కే వేరు. క్రికెట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (Shreyas Iyer) విష‌యంలో స‌రిగ్గా అదే జ‌రిగింద‌ని అంటున్నారు ఫ్యాన్స్‌. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) ఎడిష‌న్‌లో భాగంగా మంగ‌ళ‌వారం రాత్రి జ‌రిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌పై పంజాబ్ కింగ్స్ (Punjab Kings) అనూహ్య విజ‌యం సాధించింది. చండీగఢ్- ముల్లన్‌పూర్‌లోని మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్ క్రికెట్ ప్రేమికుల‌ను మంచి అనుభూతిని క‌లిగించింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ అభిమానుల‌కు రెట్టింపు ఆనందాన్ని ఇచ్చింది.

క‌ష్ట‌సాధ్య‌మైన మ్యాచ్‌లో కోల్‌క‌తాపై ఊహించని విజ‌యం ద‌క్క‌డంతో వారు త‌మ సంతోషాన్ని సోష‌ల్ మీడియా వేదికగా వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. శ్రేయ‌స్ అయ్యర్ నాయ‌క‌త్వ ప‌టిమ‌ను ప్ర‌స్తుతిస్తున్నారు. ప‌నిలో ప‌నిగా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ యాజ‌మాన్యంపై విసుర్లు విసుతున్నారు. గ‌త సీజ‌న్‌లో ఐపీఎల్ క‌ప్ సాధించి పెట్టిన అయ్య‌ర్‌ను ఈసారి కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ (kolkata knight riders) వ‌దిలేసుకుంది. జ‌ట్టును ఐపీఎల్‌ విజేత‌గా నిలిపిన కెప్టెన్‌ను కోల్‌క‌తా వ‌దిలేసుకోవ‌డం క్రికెట్ ల‌వ‌ర్స్‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ముఖ్యంగా అయ్య‌ర్ అభిమానులు బాగా హ‌ర్ట్ అయ్యారు. ఇది అయ్య‌ర్‌కు జ‌రిగిన అవ‌మానంగా వారంతా భావించారు. మెగా వేలంలో భారీ మొత్తానికి అయ్య‌ర్‌ను పంజాబ్ ద‌క్కించుకుని కెప్టెన్‌గా నియ‌మించింది.

బెస్ట్ ప్లేయ‌ర్‌, కెప్టెన్
ఈ నేప‌థ్యంలో గ‌త రాత్రి ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన మ్యాచ్ భావోద్వేగాల‌ను శిఖ‌ర స్థాయికి చేర్చింది. ఐపీఎల్‌లో అతి త‌క్కువ స్కోరును కాపాడుకుని కోల్‌క‌తాపై కింగ్స్ జ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేసింది. దీంతో పాటు ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్ అవార్డు కింగ్స్ కెప్టెన్‌ను వ‌రించడంతో అభిమానులు సోష‌ల్ మీడియాలో అయ్య‌ర్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఈ జ‌న‌రేష‌న్‌లో బెస్ట్ ప్లేయ‌ర్‌, కెప్టెన్ అంటూ పొగిడేస్తున్నారు. అవ‌మానాల‌ను పంటి బిగువ‌న భరిస్తూ ప‌దునైన‌ ఆట‌తోనే స‌మాధానం చెబుతున్నాడ‌ని మెచ్చుకుంటున్నారు. పలువురు మాజీ క్రికెట‌ర్లు కూడా శ్రేయ‌స్‌ను శభాష్ అంటూ మెచ్చుకున్నారు.

శిఖ‌ర్ కాదు.. శ్రేయ‌ర్ టీమ్
త‌న‌ను కాద‌న్న కోల్‌క‌తాపై అయ్య‌ర్ బ‌దులు తీర్చుకున్నాడని కామెంట్లు పెడుతున్నారు. మ్యాచ్ గెలిచిన త‌ర్వాత కూడా అయ్య‌ర్ అన‌వ‌స‌ర హ‌డావుడి చేయ‌కుండా చాలా హుందాగా వ్య‌వ‌హ‌రించాడ‌ని అంటున్నారు. క‌ర్మ‌ఫ‌లం అనుభ‌వించ‌క త‌ప్ప‌ద‌ని కొంత‌మంది కోల్‌క‌తాను క‌సురుకున్నారు. ఇది శిఖ‌ర్ ధ‌వ‌న్ టీమ్ కాదు, శ్రేయ‌స్ అయ్య‌ర్ టీమ్ అంటూ ఓ నెటిజ‌న్ వ్యాఖ్యానించారు. ప్ర‌త్య‌ర్ధి కోల్‌క‌తా అయితే పంజాబ్ జ‌ట్టుకు ఎక్క‌డ‌లేని బలం వ‌స్తుంద‌ని, అద్భుతాలు చేస్తుంద‌ని మ‌రో యూజ‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు. 2024 ఐపీఎల్‌లో ఈడెన్ గార్డెన్‌లో కోల్‌క‌తాపై 262 ప‌రుగుల టార్గెట్‌ను పంజాబ్ ఛేజ్ చేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

చాహ‌ల్ సూప‌ర్‌
పంజాబ్ కింగ్స్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన స్పిన్న‌ర్ యుజువేంద్ర చాహ‌ల్‌ (yuzvendra chahal)పై కూడా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. మ్యాచ్‌ను మ‌లుపు తిప్పి ఒంటిచేత్తో జ‌ట్టును గెలిపించాడ‌ని పొగుడుతున్నారు. విడాకులు తీసుకున్న త‌ర్వాత చాహ‌ల్ మ‌రింత యాక్టివ్ అయ్యాడంటూ కొంతమంది స‌రదా వ్యాఖ్య‌లు చేశారు. 

 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)