కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్
Breaking News
ICC T20I Rankings: దుమ్ము రేపిన మంధాన.. నెంబర్ 1 స్థానానికి చేరువలో!
Published on Tue, 09/20/2022 - 18:57
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మరోసారి దుమ్మురేపింది. తన టీ20 కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను మంధాన సాధించింది. తాజాగా ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకుంది. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మంధాన అదరగొట్టింది. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన ఆమె 111 పరుగులు సాధించింది.
ఈ అద్భుత ప్రదర్శన కారణంగా ఆమె రెండు స్థానాలు ఎగబాకి టాప్ ర్యాంక్‌కు చేరువైంది. అదే విధంగా వన్డే ర్యాంకింగ్స్‌లో మంధాన సత్తా చాటింది. వన్డేల్లో మూడు స్థానాలు ఎగబాకి 7వ ర్యాంక్‌కు ఈ భారత స్టార్ ఓపెనర్ చేరుకుంది.
కాగా ఇంగ్లండ్ మహిళలతో జరిగిన తొలి వన్డేలో 91 పరుగులు చేసి భారత విజయంలో మంధాన కీలక పాత్ర పోషించింది. అదే విధంగా భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వన్డే ర్యాంకింగ్స్‌లో నాలుగు స్ధానాలు ఎగబాకి 9వ స్థానానికి చేరుకుంది.
చదవండి: CSA T20 League: దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమాకు ఘోర అవమానం! ఎందుకిలా జరిగిందో చెప్పిన మాజీ ఆల్‌రౌండర్
Tags : 1